Sidharth-Kiara : పెళ్లి పీటలేక్కబోతున్న బాలీవుడ్ స్టార్స్.. ఈ సారైనా పక్కానా?

ఈ సారి మాత్రం సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు ఫిబ్రవరి 6న పెళ్లి చేసుకోనున్నట్టు బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్.. ఇతర కార్యక్రమాలు ముంబైలో జరుగుతాయని, అలాగే వీరి వివాహం.............

Sidharth-Kiara : పెళ్లి పీటలేక్కబోతున్న బాలీవుడ్ స్టార్స్.. ఈ సారైనా పక్కానా?

sidharth malhotra and kiara advani s wedding in febraury news goes viral

Sidharth-Kiara :  2022 సంవత్సరంలో చాలా మంది సెలబ్రిటీ స్టార్స్ పెళ్లిళ్లు చేసుకున్నారు. నయన్-విగ్నేష్, విక్కీ-కత్రినా, అలియా-రణబీర్.. ఇలా చాలా మంది స్టార్స్ ఒక్కటయ్యారు. మరికొంతమంది ఒక్కటవుతారని వార్తలు వచ్చినా కాలేదు. 2023కి మరికొంతమంది సెలబ్రిటీలు పెళ్ళికి రెడీగా ఉన్నట్టు ఇప్పటికే తెలుస్తుంది. అందులో బాలీవుడ్ నుంచి సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ ముందు వరసలో ఉన్నారు.

బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ కలిసి షేర్షా సినిమాలో నటించారు. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా 2021లో వచ్చింది. ఈ సినిమా కంటే ముందే స్నేహితులుగా ఉన్న వీళ్ళిద్దరూ షేర్షా సినిమా సమయంలో ప్రేమలో పడినట్టు సమాచారం. అప్పటినుంచి వీళ్ళ గురించి చాలా వార్తలు వస్తున్నా వీళ్ళు మాత్రం అధికారికంగా స్పందించలేదు.

గత కొన్ని రోజులుగా సిద్దార్థ్ – కియారా డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా అంటుంది. దానికి తగ్గట్టే వీరిద్దరూ కలిసి అనేక పార్టీల్లో కనిపించారు, క్లోజ్ గా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. వీరిద్దరూ అధికారికంగా తమ ప్రేమని ప్రకటించకపోయినా ఒకరికి ఒకరు స్పెషల్ అని మాత్రం చెప్పారు. గతంలోనే వీరి పెళ్లిపై కూడా అనేక వార్తలు వచ్చాయి. కానీ వీరి పెళ్లి మాత్రం జరగలేదు.

Sohel Ryan : నెగిటివ్ కామెంట్స్ పెడితే ఇంటికొచ్చి మరీ కొడతా.. నా కొడకల్లారా.. స్టేజిపై రెచ్చిపోయిన సోహెల్..

అయితే ఈ సారి మాత్రం సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు ఫిబ్రవరి 6న పెళ్లి చేసుకోనున్నట్టు బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్.. ఇతర కార్యక్రమాలు ముంబైలో జరుగుతాయని, అలాగే వీరి వివాహం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్ లో జరగనున్నట్టు సమాచారం. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు, పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా ఫిబ్రవరి 6న మాత్రం వీరి పెళ్లి జరుగుతుందనే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే పలు సార్లు వీరి పెళ్లిపై వార్తలు వచ్చాయి. మరి ఇదైనా నిజమేనా లేక ఇది కూడా వార్త లాగే మిగిలిపోతుందా అని అనుకుంటున్నారు కొంతమంది.