Kiara Advani – Sidharth Malhotra : కొత్త పెళ్లికూతురు కియారాకి ఘనంగా వెల్కమ్.. వైరల్ అవుతున్న వీడియోలు!

బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రా, కియారా అద్వానీ మధ్య ఉన్నది ప్రేమా? స్నేహమా? అని తికమక పడుతున్న అందరికి వారి పెళ్లి ఒక క్లారిటీ ఇచ్చేసింది. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా, సిద్దార్ద్ పెళ్లి ఘనంగా జరిగింది. కాగా కొత్త పెళ్లికూతురు కియారా తన పుట్టింటి నుంచి మొదటి సారి మెట్టింట అడుగుపెట్టిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kiara Advani – Sidharth Malhotra : కొత్త పెళ్లికూతురు కియారాకి ఘనంగా వెల్కమ్.. వైరల్ అవుతున్న వీడియోలు!

Kiara Advani – Sidharth Malhotra

Kiara Advani – Sidharth Malhotra : బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రా, కియారా అద్వానీ మధ్య ఉన్నది ప్రేమా? స్నేహమా? అని తికమక పడుతున్న అందరికి వారి పెళ్లి ఒక క్లారిటీ ఇచ్చేసింది. ‘షేర్షా’ సినిమాతో మొదటి సారి కలిసి పని చేసిన ఈ జంట.. ఆ మూవీ సమయంలోనే ప్రేమలో పడ్డారని, అప్పటి నుంచి సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తూ వస్తున్నా.. వీరిద్దరూ మాత్రం దీని పై ఎక్కడా ఓపెన్ కాలేదు. కానీ సడన్ గా ఎటువంటి హడావుడి లేకుండా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమయ్యి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

Sidharth Malhotra – Kiara Advani : ఒక్కటైన ప్రేమజంట.. ఏడడుగులు వేసేసిన కియారా, సిద్దార్ద్!

రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా, సిద్దార్ద్ పెళ్లి ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు జరిగిన ఈ వివాహ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఇషా అంబానీ, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హోత్రా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఫోటోలు, వీడియోలు బయటకి రాకుండా చూసుకున్నారు ఈ జంట. స్వయంగా కియారా అండ్ సిద్దార్ద్ తమ సోషల్ మీడియా ద్వారా తమ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

కాగా కొత్త పెళ్లికూతురు కియారా తన పుట్టింటి నుంచి మొదటి సారి మెట్టింట అడుగుపెట్టిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిన్న (ఫిబ్రవరి 8) రాత్రి ఢిల్లీలోని సిద్దార్ద్ ఇంటికి చేరుకున్న కొత్త పెళ్లికూతురు, పెళ్ళికొడుకు ఘనంగా స్వాగతం పలికారు సిద్దార్ద్ కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే సిద్దార్ద్ తో కలిసి కియారా డాన్స్ చేసి సందడి చేసింది. ఇక ఈరోజు (ఫిబ్రవరి 9) రాత్రి ఢిల్లీలో ఫ్యామిలీ రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 10న ముంబైలో ఫ్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ వ్యక్తులకు మరో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)