Aditya Om : మీ స్టైల్ లో పాట పాడండి.. డ్యాన్స్ చేయండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి..

ఈ చిత్రంలోని గరళం తాగినోడు గంగమ్మ మొగుడు అనే ఒక పాట మంచి సాహిత్య విలువలతో ఆలోచించేసేదిగా వుంది. ఈ పాటను రిలీజ్ చేస్తూ పాడితే లక్ష / ఆడితే లక్ష మరియు తదుపరి సినిమాలో అవకాశం అనే పోటీని..............

Aditya Om : మీ స్టైల్ లో పాట పాడండి.. డ్యాన్స్ చేయండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి..

Sing the song in your version from dahanam movie and win one lakh rupees

Aditya Om :  ఒకప్పటి హీరో ఆదిత్య ఓం హీరోగా ఓపెన్ ఫీల్డ్ మీడియాలో నిర్మించబడిన దహనం అనే సినిమా మార్చి రెండవ వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం ఇప్పటికే ఆరు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.

ఈ చిత్రంలోని గరళం తాగినోడు గంగమ్మ మొగుడు అనే ఒక పాట మంచి సాహిత్య విలువలతో ఆలోచించేసేదిగా వుంది. ఈ పాటను రిలీజ్ చేస్తూ పాడితే లక్ష / ఆడితే లక్ష మరియు తదుపరి సినిమాలో అవకాశం అనే పోటీని నిర్వహిస్తున్నట్టుగా చిత్ర నిర్మాత డాక్టర్ సతీష్ వెల్లడించారు. ఈ పాట OFM youTube ఛానల్ లో ఉంచటం జరిగింది. ఈ పాటను డౌన్ లోడ్ చేసుకొని తమదైన బాణీలో పాడి లేదా మంచి డాన్స్ కంపోజ్ చేసి అప్ లోడ్ చెయ్యాల్సి వుంటుంది. ఎవరి వీడియోకి ఎక్కువ వ్యూస్ వుంటే వారిని విజేతలుగా నిర్ణయించటం జరుగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు, ఫిబ్రవరి 28 వరకు పోటీ దారులు వారి పాటను పంపొచ్చు అన్నారు.

RRR in Japan : RRR సరికొత్త రికార్డ్.. జపాన్ లో 100 రోజులు ఆడిన ఫస్ట్ ఇండియన్ సినిమా.. ఎన్ని సెంటర్స్ తెలుసా??

ఈ కార్యక్రమానికి దహనం చిత్ర బృందం నిర్మాత డాక్టర్ పి.సతీష్ కుమార్, దర్శకులు ఆడారి మూర్తి సాయి, చిత్ర హీరో ఆదిత్క ఓం, సహా దర్శకుడు ఆళ్ళ తరుణ్ కుమార్, నటులు ఎఫ్.ఎం. బాబాయ్, శాంతి చంద్ర, రాజీవ్, సోనీ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పలు అవార్డులు సొంతం చేసుకున్న దహనం సినిమా ఫిబ్రవరి నెల చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ దీనిలో చివరిలో జరిగే క్లైమాక్స్ సినిమాకి ఆల్మోస్ట్ 20 మినిట్స్ ముందు నుంచి సినిమా అయిందా అనుకొని ఆడియన్స్ లేస్తారు కానీ ఒక కంటిన్యూ మీకు అనుకొని మలుపులు లాస్ట్ 20 మినిట్స్ ఉంటారు అని తెలిపారు.