Singer Kousalya : సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్

కరోనావైరస్ మహమ్మారి ఎవరినీ వదలడం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది.

Singer Kousalya : సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్

Singer Kousalya

Singer Kousalya : కరోనావైరస్ మహమ్మారి ఎవరినీ వదలడం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా సింగర్ కౌసల్య సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ లో తెలిపారు.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

”నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయి. ముందు జ్వరం వచ్చింది. రెండు రోజుల పాటు జ్వరంగా ఉంది. మంచం మీద నుంచి కూడా లేవలేకపోయా. ఆ తర్వాత గొంతు నొప్పి వచ్చింది. చాలా ఇబ్బందిగా ఉంది. నిన్నటి నుంచి మందులు తీసుకోవడం మొదలు పెట్టాను. దయచేసి అంతా జాగ్రత్తగా ఉండండి” అని కౌసల్య ట్వీట్ చేశారు.

దేశంలో కరోనావైరస్ మహమ్మారి తగ్గినట్లే తగ్గి.. మళ్లీ ఓ రేంజ్ లో కల్లోలం రేపుతోంది. థర్డ్ వేవ్ లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేదు.. కరోనా మహమ్మారి అందరిపైనా ప్రతాపం చూపిస్తోంది. గత వారం రోజులుగా ప్రతి రోజూ సరాసరిగా 3 లక్షల కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న సంకేతాలు వెలువడుతున్నా.. దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఇంకా మూడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండటం కాస్త ఆందోళనకు గురిచేసే అంశం.

Richest Rich KID: తొమ్మిదేళ్ల కుర్రాడికి విలాసవంతమైన భవనం, ప్రైవేట్ జెట్, సూపర్ కార్స్

దేశంలో ప్రస్తుతం 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై గురువారం మీడియాకు వివరాలు వెల్లడించిన ఆరోగ్య శాఖ అధికారులు.. దేశంలోని 11 రాష్ట్రాల్లో 50 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల వ్యవధిలో దేశంలో 2లక్షల 86వేల 384 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కు చేరుకుంది.