గెట్ వెల్ సూన్ : ఆస్పత్రిలో లతా మంగేష్కర్

  • Edited By: vamsi , November 11, 2019 / 11:51 AM IST
గెట్ వెల్ సూన్ : ఆస్పత్రిలో లతా మంగేష్కర్

లెజండరీ గాయని, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె వయస్సు ఇప్పుడు 90ఏళ్లు కాగా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందికి గురి కావడంతో వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లారు.

కొన్ని రోజులుగా ఆమెకు శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లుగా ఆమె బంధువులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

అన్ని భాషలలో కలిపి 25వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసిన లతా మంగేష్కర్ వయోభారంతో కొన్నేళ్లుగా పాటలు పాడట్లేదు. భారత ప్రభుత్వం లత మంగేష్కర్‌కు ఇప్పటికే పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులను ఇచ్చింది. ఆమె ఖాతాలో మూడు నేషనల్ అవార్డులు కూడా ఉన్నాయి.