Bigg Boss 5 Telugu : హౌస్ సెట్ లోకి ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ విన్నర్..!

బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కంటెస్టెంట్ల సెలక్షన్ ప్రక్రియ తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కు ఓ సింగర్ ని సెలెక్ట్ చేశారంట నిర్వాహకులు.

Bigg Boss 5 Telugu : హౌస్ సెట్ లోకి ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ విన్నర్..!

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్‌ తెలుగు నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఐదవ సీజన్ వైపు చకచకా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 90 శాతం కంటెస్టెంట్ల సెలక్షన్ కూడా పూర్తైంది. ఇక ఒకరిద్దరు కంటెస్టెంట్లతో నిర్వాహకులు మంతనాలు జరుపుతున్నాయి. ఇక ప్రేక్షకులను అలెర్ట్ చేసేందుకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు.

ఇక కంటెస్టెంట్ల పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిర్వాహకులు ఇంకా వెల్లడించనప్పటికి విశ్వసనీయ వర్గాల నుంచి బిగ్‌బాస్‌ తెలుగు ఐదవ సీజన్ లో పాల్గొనే వారి జాబితా బయటకు వచ్చింది. యాంకర్‌ రవి, విశ్వ, సరయూ, కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌, యానీ మాస్టర్‌, లోబో, మానస్‌, ఉమా దేవి, జశ్వంత్‌, ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక, వీజే సన్నీ, ఆర్జే కాజల్‌, ప్రియ, వర్షిణి, లహరి శ్రీ ఉన్నారు. ఈ లిస్టులో మార్పుచేర్పులు ఉండే అవకాశమూ లేకపోలేదు.

సినిమా పరిశ్రమకు చెందిన అన్ని విభాగాల నుంచి కంటెస్టెంట్లు ఉండేలా సెలెక్ట్ చేశారు. ప్రతి సీజన్ లో ఓ సింగర్ ఉన్నట్లే.. ఈ సీజన్ లో కూడా ఓ సింగర్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్టార్‌ సింగర్‌ శ్రీరామచంద్రను షోలోకి రప్పిస్తున్నారని సమాచారం. 2010లో ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ గెలుచుకున్న శ్రీరామచంద్ర పాటలు పాడటంతో పాటు, పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అతడు షోలోకి వస్తే పాట, నటనతో పాటు ఆటతోనూ మనసులు గెలుచుకుంటాడని అంటున్నారు ఆయన అభిమానులు.

గత సీజన్లలో సింగర్ల ప్రభావం అధికంగా ఉంది. గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ అందరిని మెప్పించారు. రాహుల్ ఏకంగా టైటిల్ కైవసం చేసుకున్నారు. ఇక బిగ్‌బాస్‌ 2 లో గీతామాధురి మంచి పోటీ ఇచ్చారు. ఈ సీజన్ లో శ్రీరామచంద్ర కూడా అదేవిధంగా పోటీ ఇస్తారని ఆయన అభిమానులు అంటున్నారు.