పళ్లు రాలిపోతాయి.. వాడు నా మేనల్లుడు కాదు.. మోసపోకండి.. సింగర్ సునీత..

10TV Telugu News

సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ మోసాగాళ్లు కూడా పెరిగి పోతున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో కొందరు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ.. మాకు వారు తెలుసు, వీరు తెలుసు అని చెబుతూ మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కొందరు సెలబ్రిటీలు ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్స్ కూడా ఇచ్చారు. తాజాగా సింగర్ సునీత మేనల్లుడిని అని చెప్పి చైతన్య అనే అతను ఇలాంటి మోసాలే చేస్తుండటంతో.. ఈ విషయం తెలుసుకున్న సునీత వెంటనే తన ఫేస్‌బుక్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనకు చైతన్య అనే మేనల్లుడు లేడని, దయచేసి ఎవరూ అతని వలలో పడి మోస పోవద్దని కోరారు.


Fake Singer Chaitanya

ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను అందరికీ ఒక విషయంపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చైతన్య అనే అతను నా మేనల్లుడు అని చెప్పి, సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని కూడా తెలిసింది. ఇది తెలిసి నేను షాక్ అయ్యాను. నాకసలు చైతన్య అనే మేనల్లుడు లేనే లేడు.


దయచేసి ఇకపై ఎవరూ మోసపోకండి. మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా చెబుతున్నాను. అయినా ప్రతి రోజూ ఇలా ఇండస్ట్రీలో మోసాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా ఎలా మోసపోతున్నారు. సెలబ్రిటీకి చుట్టం అనగానే ఎందుకు వారికి డబ్బులిచ్చి మోసపోతున్నారు. కొంచెమైనా ఆలోచించరా? ఇకపై బయటి వ్యక్తులు ఎవరైనా ఇలా చెబితే కాస్త ఆలోచించండి. డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు..’’ అని సునీత ఈ వీడియోలో తెలిపారు.


https://www.facebook.com/singer.sunitha/posts/1763050497177284