singer Sunitha : నేను రామ్‌ను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు : గాయని సునీత

టాలీవుడ్ సింగర్ సునీత తన రెండో వివాహం గురించి వచ్చిన, వస్తున్న వ్యాఖ్యలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.నేను రామ్ ని డబ్బు కోసమే వివాహం చేసుకున్నానని అంటున్నారు. కానీ నేను డబ్బు కోసం వివాహం చేసుకోలేదని రామ్ ఆస్తుల గురించి నాకు ఇప్పటి వరకూ తెలియదని స్పష్టంచేసింది.

singer Sunitha : నేను రామ్‌ను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు : గాయని సునీత
ad

singer Sunitha Marriage : టాలీవుడ్ సింగర్ సునీత. పాటలు పాడటం ప్రారంభంలోనే నంది అవార్డును సొంతం చేసుకున్న అద్భుత గాయని. ఆమె గొంత ఎంత మధురం. కానీ ఆమె వ్యక్తి గత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. వైవాహిక జీవితంలో విభేధాలతో భర్తనుంచి విడిపోయింది. ఓ అమ్మగా వారికి ఇద్దరు పిల్లలను ఏ లోటు లేకుండా పెంచుకుంది. ఎన్ని మాటలు భరించినా చిన్న చిరునవ్వుతోనో ఎదుర్కొంది. అంతులేని ఆత్మవిశ్వాసంతో కష్టాలను కూడా జయించి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

జీవితంలో ఎదురయ్యే స‌వాళ్ల‌ను ఎలా అధిగ‌మించాలో సునీత‌ను చూసి నేర్చుకోవ‌చ్చని ఆమె సన్నిహితులే కాదు ఆమెకు పరియమున్నవారు కూడా చెబుతుంటారు. పిల్లిని కూడా ఇంట్లో పెట్టి కొడితే ఎదురు తిరుగుతుంది అన్నట్లుగా సునీత కూడా తనపై వచ్చే ఎన్నో రూమర్లను చెదరని చిరునవ్వుతోనే ఎదుర్కొంది. అవాకులు చవాకులు పేలినవారికి ధీటైన సమాధానం చెప్పటంలో ఆమెకు ఆమే సాటి అన్నట్లుగా వ్యవహరించింది. ఎన్ని మాటలు పడినా ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.అన్నింటిని ఎదురొడ్డి నిలిచి..ప్రముఖ వ్యాపారవేత్త అయిన మ‌ళ్లీ 15 ఏళ్ల‌కు రామ్ ను రెండో వివాహం చేసుకుంది. అప్పుడు కూడా ఎన్నో ఈటెల్లాంటి మాటలు..అయినా ఆమె పెదవులపై చిరునవ్వు చెదరలేదు.

ఎదిగిన ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇప్పుడు రెండో పెళ్లి అవసరమా?అని ఎంతోమంది అనసరపు వాగుళ్లు. డబ్బుల కోసమే రామ్ ని పెళ్లి చేసుకుందనే నిందలు. ఆమెను అనేవాళ్లు ఆమె బాగోగులు..పిల్లల జీవితాలను చూస్తారా? వాళ్లకు కష్టమొచ్చిదంటే ఈ వాగిన నోళ్లు కనీసం సలహా చెబుతాయా? ఓదారుస్తాయా? అంటే అదేమీ ఉండదు. కానీ నోరు కదా..ఖాళీగా ఉండలేక ఎదుటివారి గురించి ఏదో వాగుతుంటుంది.అలా చాలా నోళ్లే వాగాయి. ఆమె వ్యక్తిగత జీవితం గురించి..కానీ ఆమె ఏనాడు వారిపై నోరు పారేసుకోలేదు.చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది.

ఈక్రమంలో ఆమెపై వాగే నోళ్లు ఆగలేదు. నిరంతరం ఏదోక వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై స్పందించకపోతే అవి కంటిన్యూ అవుతునే ఉంటాయి. అందుకే డ‌బ్బు కోస‌మే రామ్ ను పెళ్లి చేసుకున్నాన‌ని అనే వ్యాఖ్యలపై సునీత స్పందించింది…‘ డ‌బ్బు కోస‌మే రామ్ ను పెళ్లి చేసుకున్నాన‌ని అంటున్నారు. కానీ రామ్ ఎంత సంపాదిస్తున్నాడో, అత‌డికి ఎన్ని ఆస్థులున్నాయో, రామ్ వ్యాపార లావాదేవీలేంటో నాకిప్ప‌టివ‌ర‌కు తెలియ‌దు. జీవితంలో ఎన్నో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర్కొన్న త‌ర్వాత అచేత‌న స్థితిలోకి వెళ్లి వ్య‌క్తుల‌ను న‌మ్మ‌డం మానేశాను. నాకు ఎదురైన ఘటనలు అటువంటివి.

కానీ రామ్ విష‌యంలో నేను ఎందుకు ప్రేమించానంటే..రామ్ నాకు ప్ర‌పోజ్ చేసిన‌పుడు..నువ్వు నా ప్ర‌పోజ‌ల్ ఒప్పుకుంటే నేను సంతోషంగా ఫీల‌వుతా. అంతేకాదు నువ్వు తిర‌స్క‌రించినా నేను బాధ‌ప‌డ‌ను. నీకు ఎప్పటికీ మంచి స్నేహితుడిగానే ఉంటా..కానీ నా జీవితాన్ని ఇక్క‌డే ఆప‌ను. ముందుకు న‌డిపిస్తాన‌ని రామ్ నాతో చెప్పాడు. రామ్ లో ఉండే ఆ నిజాయితీ నాకు న‌చ్చింది. అందుకే రామ్‌ కు పెళ్లి చేసుకున్నా..అంతే తప్ప అతని డబ్బు గురించికాదు అని స్పష్టంచేసింది సునీత. నాకు రామ్ అంటే ఎంత గౌరవమో..తనకు కూడా నేనంటే అంతకంటే ఎక్కువ గౌరవం అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది సునీత‌.

అంద‌రి టీనేజ‌ర్ల లాగే నా జీవితం కూడా చాలా అద్బుతంగా ఉండాల‌నుకుని ఆశపడేదాన్ని. న‌న్ను జాగ్ర‌త్త‌గా చూసుకునే భర్త రావాల‌ని ఆశపడ్డాను ఓ సాధారణ ఆడపిల్లలాగే.కానీ కిర‌న్ కుమార్ గోప‌రాజును (మొద‌టి పెళ్లి)పెళ్లి చేసుకున్న త‌ర్వాత చాలా ఇబ్బందులే పడ్డాను. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నాను. జీవిత‌మంటే ఏంటో నాకు అప్పుడే తెలిసింది. అతని నుంచి విడిపోయాక పిల్లలే జీవితం అన్నట్లుగా ఉన్నాను.కానీ మ‌ళ్లీ 15 ఏళ్ల‌కు రామ్ (రెండో పెళ్లి చేసుకున్నా. రామ్ ని నేను డబ్బు కోసం కాదు నామీద అతనికి ఉన్న ప్రేమ…గౌరవం ఉండటం వల్లే వివాహం చేసుకున్నా..అంతే తప్ప డబ్బు కోసం మాత్రం ఎంత మాత్రం కాదని స్పష్టం చేసిది సునీత.