Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి.. | singer vagdevi is the first telugu indian idol winner in aha

Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..

15 వారల సుదీర్ఘ సంగీత ప్రయాణం తర్వాత ఆహాలో శుక్రవారం నాడు ఫినాలే టెలికాస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి కూడా విచ్చేసి గ్రాండ్ ఫినాలేను........

Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..

Telugu Indian Idol :  తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవలే తెలుగు సింగర్స్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది సింగర్స్ పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమం ఫినాలేతో పూర్తి అయింది. ఇటీవల జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ సెమి ఫైనల్స్ కి బాలయ్య బాబు గెస్ట్ గా రాగా, ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ వచ్చారు.

 

15 వారల సుదీర్ఘ సంగీత ప్రయాణం తర్వాత ఆహాలో శుక్రవారం నాడు ఫినాలే టెలికాస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి కూడా విచ్చేసి గ్రాండ్ ఫినాలేను సక్సెస్ చేశారు. ఫైనల్ కి అయిదుగురు కంటెస్టెంట్స్ రాగా అందులో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వాగ్దేవి ట్రోఫీని అందుకొని మొట్ట మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ గా నిలిచింది. తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవికి ట్రోఫీతో పాటు 10 లక్షల బహుమానం మరియు గీత ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా వచ్చింది.

Heroins : మరోసారి ట్రోల్ అవుతున్న బాలీవుడ్ హీరోయిన్స్..

అలాగే మొదటి రన్నరప్ శ్రీనివాస్ కు 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవికి 2 లక్షల బహుమానం ఇవ్వడం జరిగింది. వైష్ణవి పాటకు మంత్రముగ్ధులయిన చిరంజీవి తన తర్వాత సినిమా గాడ్ ఫాదర్ లో పాడే అవకాశం ఇచ్చారు. ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో తెలుగులో మొట్ట మొదటి సారిగా ఆహా తీసుకువచ్చింది. ఈ షోకి యాంకర్ గా సింగర్ శ్రీరామచంద్ర నిర్వహించంగా, న్యాయనిర్ణేతలుగా తమన్, నిత్య మీనన్, మరియు కార్తీక్ ఉన్నారు.

×