Sir Movie Free shows : 500 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫ్రీగా ‘సార్’ సినిమా చూపించిన చిత్రయూనిట్, PVR..

తాజాగా సార్ సినిమా యూనిట్, PVR సంస్థతో కలిసి ఓ మంచిపని చేసింది. సార్ సినిమాలో చదువు గురించి గొప్పగా చెప్పడంతో ఈ సినిమా ప్రతి విద్యార్థికి చేరాలనుకున్నారు. దీంతో తాజాగా హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థులకు..................

Sir Movie Free shows :  ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిన సినిమా సార్. సాంగ్స్, ట్రైలర్ సూపర్ టాక్ తెచ్చుకోవడంతో ముందునుంచే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజయింది. రిలీజయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టింది ఈ సినిమా. ఇక కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. సార్ సినిమాకు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం.

ముఖ్యంగా సార్ సినిమా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి చెప్పడం. మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పడం, ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా మౌత్ టాక్ తోనే మరింత విజయం సాధిస్తుంది. ఇక చదువుకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఈ సినిమాలో చెప్పడంతో స్టూడెంట్స్, టీచర్స్ ఈ సినిమాకి చాలా మంది వస్తున్నారు. చదువుకునే వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు అందరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలని చిత్ర యూనిట్ తో పాటు సినిమా చూసిన వాళ్ళు కూడా అంటున్నారు.

తాజాగా సార్ సినిమా యూనిట్, PVR సంస్థతో కలిసి ఓ మంచిపని చేసింది. సార్ సినిమాలో చదువు గురించి గొప్పగా చెప్పడంతో ఈ సినిమా ప్రతి విద్యార్థికి చేరాలనుకున్నారు. దీంతో తాజాగా హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థులకు సార్ సినిమాని PVR థియేటర్స్ లో ఫ్రీగా చూపించారు. అంతే కాకుండా వారికి ఫ్రీగా పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, బెలూన్స్ కూడా అందించారు చిత్రయూనిట్. అలాగే సినిమా చూసిన తర్వాత ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి సినిమా ఎలా ఉంది అంటూ ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు. సినిమా చూసిన ఆ విద్యార్థులంతా సార్ సినిమా చాలా బాగుంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Actor Shafi : ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి నటుడు షఫీ.. బెస్ట్ యాక్టర్ విభాగంలో..

గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ వచ్చి సినిమా చూడటం, హాల్ లో సందడి చేయడం వంటి దృశ్యాలని చిత్రీకరించి PVR సంస్థ, చిత్రయూనిట్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ అభినందిస్తున్నారు. ఈ సినిమా మరింత మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు