Shrihan : తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన సిరి హన్మంత్.. ఇతనే నా సర్వస్వం అంటూ పోస్ట్..

తాజాగా సిరి ఓ ఫోటో షేర్ చేసి పోస్ట్ చేసింది. దీంతో తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది సిరి హన్మంత్. తాజాగా సిరి ఓ పార్టీలో శ్రీహాన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..................

Shrihan : తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన సిరి హన్మంత్.. ఇతనే నా సర్వస్వం అంటూ పోస్ట్..

Siri

 

Siri hanmanth :  సిరి హన్మంత్‌ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక బిగ్‌బాస్‌ సీజన్ 5 తర్వాత సిరి బాగా పాపులర్ అయింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో షణ్ముఖ్‌ జష్వంత్ తో బాగా క్లోజ్ గా ఉండటం, హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో వీరిద్దరూ బాగా పాపులర్ అయ్యారు. అయితే వీరి ఓవర్ యాక్షన్ వల్ల బయట ప్రేక్షకుల్లో బాగా నెగిటివిటీ ఏర్పడింది.

హౌస్ నుంచి బయటకి వచ్చాక షణ్ముఖ్, సిరి ఈ నెగిటివిటీని ఎదుర్కోలేకపోయారు. ఇక హౌస్ నుంచి బయటకి రాగానే దీప్తి సునైనా షన్నుకి బ్రేకప్ చెప్పింది. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణం సిరినే అని అంతా అనుకున్నారు. అటు సిరికి ముందు నుంచి సపోర్ట్ ఇస్తూ వచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా హౌస్ నుంచి బయటకి వచ్చాక సిరిని పెద్దగా పట్టించుకోలేదు. అంతే కాక సిరితోకలిసి దిగిన ఫోటోలని తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు శ్రీహాన్. దీంతో వీరిద్దరూ కూడా విడిపోయారు అనే వార్తలు వచ్చాయి. తర్వాత కూడా పలుమార్లు వీరు ఇద్దరు విడిపోయారని వార్తలు వచ్చాయి.

Olivia Morris : నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమా చూశా.. ఎన్టీఆర్‌ని ఆ పాటలో చూసి ఏడ్చేశా..

తాజాగా సిరి ఓ ఫోటో షేర్ చేసి పోస్ట్ చేసింది. దీంతో తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది సిరి హన్మంత్. తాజాగా సిరి ఓ పార్టీలో శ్రీహాన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ”ప్రతి క్షణం నా మంచి, చెడు సమయాల్లో పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్‌, నా సర్వస్వం అన్ని ఇతనే. మై వన్‌ అండ్‌ ఓన్లీ శ్రీహాన్‌” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని రోజుల నుంచి వీరి రిలేషన్ పై అనేక వార్తలు రాగా తాజాగా ఈ ఒక్క పోస్ట్ తో అన్నిటికి చెక్ పెట్టి క్లారిటీ ఇచ్చింది సిరి. ఇక వీళ్లిద్దరు కలిశారు, దీప్తి షన్ను కూడా కలిస్తే బాగుండు అని కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు, నెటిజన్లు.