Shannu-Deepu : నా వల్ల షన్ను దీప్తి బ్రేకప్ జరగలేదు: సిరి హన్మంత్

ఇటీవల సిరి ఓ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్ షోలో నాకు ష‌ణ్ముఖ్‌, జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్‌. ష‌ణ్నుకు, నాకు మ‌ధ్య ఉన్న‌ది ఫ్రెండ్‌షిప్ మాత్ర‌మే...........

Shannu-Deepu : నా వల్ల షన్ను దీప్తి బ్రేకప్ జరగలేదు: సిరి హన్మంత్

Siri Shannu

Shannu-Deepu :   సోషల్ మీడియా స్టార్స్ షణ్ముఖ్, దీప్తి సునైనా ఫేమస్ లవ్ కపుల్. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో, టీవీ షోలలో చాలా సార్లు వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు. వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లోను నటించారు. అయితే ఇటీవల షన్ను బిగ్ బాస్ నుంచి వచ్చాక దీప్తి సునైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి షణ్ణుకి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి రిప్లైగా తాను హ్యాపీగా ఉండాలి అని బాధతో షణ్ముఖ్ కూడా పోస్ట్ చేశాడు. అయితే అప్పుడే షన్నుకి విడిపోవడం ఇష్టం లేదని, దీప్తినే బ్రేకప్ చెప్పిందని వార్తలు వచ్చాయి.

ఇటీవల ఈ విషయంపై షణ్ముఖ్ తండ్రి కూడా మాట్లాడుతూ.. దీప్తినే బ్రేకప్ చెప్పింది. షన్ను చెప్పలేదు. వాళ్ళు మళ్ళీ కలుస్తారు అని అన్నారు. వాళ్ళు మళ్ళీ కలుస్తారో కలవరో తెలీదు కానీ వీళ్ళ బ్రేకప్ మాత్రం రోజూ వార్తల్లో నిలుస్తుంది. వీళ్లిద్దరు విడిపోవడానికి సిరి హన్మంతు కారణమని, షన్ను బిగ్ బాస్ హౌస్ లో సిరితో క్లోజ్ గా ఉండటం వల్లే దీప్తి షణ్ణుకి బ్రేకప్ చెప్పిందని వార్తలు కూడా వచ్చాయి. వాటిపై సిరి సన్నిహితుల వద్ద మాట్లాడింది కానీ బయటకి నోరు విప్పలేదు. తాజాగా సిరి హన్మంతు ఈ వ్యాఖ్యల్ని ఖండించింది.

Samantha : 80 కిలోలని అవలీలగా ఎత్తేసిన సమంత

ఇటీవల సిరి ఓ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్ షోలో నాకు ష‌ణ్ముఖ్‌, జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్‌. ష‌ణ్నుకు, నాకు మ‌ధ్య ఉన్న‌ది ఫ్రెండ్‌షిప్ మాత్ర‌మే. కాక‌పోతే కొద్దిగా ఎక్కువ‌గా ఎమోష‌న‌ల్ అయ్యాం. దీప్తి సున‌య‌న కూడా నాకు ఫ్రెండే, త‌న‌తో క‌లిసి వ‌ర్క్ కూడా చేశాను. బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూసి డిప్రెష‌న్‌లోకి వెళ్లాను. దాన్నుంచే బ‌య‌ట‌ప‌డే స‌మ‌యానికి దీప్తి బ్రేక‌ప్ అని చెప్ప‌డంతో మ‌ళ్లీ నా మీద ట్రోల్ చేశారు. దీంతో నేను మరింత బాధపడ్డాను. నావ‌ల్ల బ్రేక‌ప్ జ‌రిగేంత బ‌ల‌హీన‌మైన ప్రేమ కాదు వాళ్ల‌ది. నా వ‌ల్లే అంటే ఆ బ్రేక‌ప్ ఎప్పుడో జ‌రిగేది. ఒక్క బిగ్‌బాస్ వ‌ల్లే, అది కూడా నా వ‌ల్లే అయితే బ్రేక‌ప్ జ‌ర‌గ‌లేదు. వాళ్ళ బ్రేకప్ కి నేను అయితే కారణం కాదు. వాళ్ళ కారణాలు ఏమున్నాయో నాకు తెలియదు” అని తెలిపింది. ఇంతకీ వాళ్ళ బ్రేకప్ కి కారణాలు ఏంటో మాత్రం ఎవరికీ తెలీదు.