Bigg Boss 5: షన్నుకు సిరి హగ్గులు.. ఫీలింగ్స్‌ భయంతో పింకీ-మానస్ దూరం!

మొత్తంగా గత వారం యాంకర్ రవి ఎలిమినేషన్ తో షాక్ లో ఉన్న బిగ్ బాస్ ఇంటి సభ్యులు నిన్న ఒక్కసారిగా మళ్ళీ నామినేషన్స్ ప్రక్రియలో పడ్డారు. మొత్తంగా ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న..

Bigg Boss 5: షన్నుకు సిరి హగ్గులు.. ఫీలింగ్స్‌ భయంతో పింకీ-మానస్ దూరం!

Bigg Boss 5: మొత్తంగా గత వారం యాంకర్ రవి ఎలిమినేషన్ తో షాక్ లో ఉన్న బిగ్ బాస్ ఇంటి సభ్యులు నిన్న ఒక్కసారిగా మళ్ళీ నామినేషన్స్ ప్రక్రియలో పడ్డారు. మొత్తంగా ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఏడుగురు సభ్యులలో కెప్టెన్ అయిన కారణంగా షణ్ముఖ్, ఎవరు నామినేట్ చేయకపోవడంతో సన్నీ ఈ వారం ఎలిమినేషన్ లో లేకపోగా మిగతా ఐదుగురు నామినేట్ అయ్యారు. ఇక సోమవారం ఎపిసోడ్ లో యాంకర్ రవి గురించి కాస్త చర్చ జరగగా.. యధావిధిగా ఎమోషన్స్, హగ్గులు మరోసారి హైలెట్ అయ్యాయి.

Bigg Boss 5: ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు.. ఎలిమినేట్ అయ్యేది?

ముందుగా ఈ సీజన్ టైటిల్ గురించి జరిగిన చర్చలో మానస్ తనకు టైటిల్ కన్నా ప్రజల మనసు ముఖ్యమని చెప్పగా.. ఈ మధ్య ప్రియాంకను కనీసం ముట్టుకోవడం లేదని.. ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్‌ వస్తున్నాయో అన్న భయంతో హగ్‌ చేసుకోవడం కూడా మానేశానని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో మానస్, పింకీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటుండగా మానస్ వెళ్లిపోవడంతో పింకీ నీది అయిపోగానే వెళ్ళిపోతావా అంటూ మొదలు పెట్టింది. దీనికి మాటకి మాట సమాధానాలతో ఇద్దరి మధ్య అంతరం పెరిగిపోయింది.

Bigg Boss 5 : బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్.. అమిత్ షాకు లేఖ

ఇక.. షణ్ముఖ్, సిరిల సంగతి సరేసరి. హోస్ట్ నాగార్జున, సిరి తల్లి, సిరి బాయ్ ఫ్రెండ్, షణ్ముఖ్ కుటుంబ సభ్యులు కూడా ఈ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందని వారించినా.. ఎందుకు ఇంతలా కనెక్ట్ అవుతున్నారని.. బయట ప్రేక్షకులు తప్పుగా అనుకుంటున్నారని వాళ్లకి తెలిసినా సిరి మాత్రం ఆగడం లేదు. ఈసారి కూడా షన్ను వద్దంటున్నా సిరి హగ్గులు మీద హగ్గులు ఇచ్చేస్తుంది. పాపం షన్ను ఎంత వారించినా వినకుండా ఫ్రెండ్‌షిప్‌ హగ్గంటూ మరోసారి హత్తుకొని ఏదేదో చేసేసింది.