Bigg Boss 5 : పాన్ షాప్ పెట్టి సిరిని పెంచాను.. షణ్ముఖ్‌ని హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు: సిరి తల్లి

చివర్లో సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి వచ్చింది. రావడంతోటే సిరి వద్ద అందరు ఉండగానే షణ్ముఖ్ టాపిక్ మాట్లాడింది. సిరితో షణ్ముఖ్‌ను నువ్వు హగ్‌ చేసుకోవడం నచ్చలేదని............

10TV Telugu News

 

Bigg Boss 5 :  నిన్న బిగ్ బాస్ ఎమోషనల్ ఎపిసోడ్ గా సాగింది. కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రావడంతో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. శ్రీరామ్ కోసం తన సోదరి అశ్విని, మానస్ కోసం తల్లి పద్మిని హౌస్ లోకి వచ్చారు. చివర్లో సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి వచ్చింది. రావడంతోటే సిరి వద్ద అందరు ఉండగానే షణ్ముఖ్ టాపిక్ మాట్లాడింది.

Rakul Preet Singh : రకుల్ కొత్త బిజినెస్.. సినిమా ఇండీస్ట్రీకి కొత్తగా వచ్చేవారికోసం

సిరితో షణ్ముఖ్‌ను నువ్వు హగ్‌ చేసుకోవడం నచ్చలేదని అందరి ముందు చెప్పేసింది. తండ్రి లేని పిల్ల కదా.. షణ్ముఖ్‌ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నాకు నచ్చలేదు. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పడంతో సిరి టాపిక్‌ డైవర్ట్‌ చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది. హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు, వాళ్ళు ఫీలవుతారు కదా అని చెప్పడంతో తల్లిగా అనిపించింది, చెప్పవలసిన బాధ్యత నాకుంది అని చెప్పింది శ్రీదేవి. అప్పుడు అందరిముందు కాకుండా నాకు పర్సనల్‌గా చెప్పాల్సిందని సిరి అంది.

Aryan Khan : ఇంకా తేరుకొని ఆర్యన్ ఖాన్… కౌన్సిలింగ్ ఇప్పించనున్న హృతిక్

ఆ తర్వాత శ్రీదేవి సిరితో మాట్లాడుతూ.. నువ్వెలాగో టాప్‌ 5లో ఉంటావంటున్నారు, కానీ నువ్వు మాత్రం కప్పు తీసుకొనే రావాలి అని చెప్పింది. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ తో తన కష్టాలు చెప్పుకుంటూ బాధపడింది సిరి తల్లి. సిరికి ఊహ తెలిసినప్పుడే వాళ్ల డాడీ చనిపోయారు. చిన్న పాన్‌షాప్‌ పెట్టి ఆమెను చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. కష్టపడి చదివించినందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చారు. నన్ను సిరి తల్లిగా గుర్తిస్తున్నారు. ఆమెకు తల్లినయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను అంటూ ఎమోషనల్ అయింది సిరి తల్లి శ్రీదేవి.

Akhanda : బాలయ్యతో 9 రోజులు దుమ్ములో ఫైట్ చేశాను.. బాలయ్యకి విలన్ అంటే అంత ఈజీ కాదు : శ్రీకాంత్

ఆమె వెళ్లిపోయాక సిరి వచ్చి షణ్ముఖ్ ని హగ్‌ చేసుకుని ఏడవగా షణ్ను ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా గేమ్‌ కూడా వదిలేసి సిరికి ఇంత సపోర్ట్‌ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు. అలా హగ్గులు నచ్చలేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదని, ఇంకా ఎందుకున్నానో అర్థం కావట్లేదని తనలో తానే బాధపడుతూ కూర్చున్నాడు షణ్ముఖ్. ఈ దెబ్బతో వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని భావిస్తున్నారు ప్రేక్షకులు.