Siri-Srihan : సిరి, శ్రీహన్ విడిపోలేదు.. ఇదే సాక్ష్యం

శ్రీహాన్‌ కూడా సిరి ఫోటోలు డిలీట్‌ చేయడంతో పాటు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ ఒక్కసారి కూడా కలిసి ఉన్న ఫోటో షేర్ చేయలేదు. దీంతో వీరు కూడా విడిపోతున్నట్టు వార్తలు.........

Siri-Srihan : సిరి, శ్రీహన్ విడిపోలేదు.. ఇదే సాక్ష్యం

Siri Hanumanth

Siri-Srihan :   బిగ్‌బాస్‌ సీజన్‌-5 ప్రేమికులని విడదీసిందనే చాలా మంది అనుకుంటున్నారు. సిరి, షన్ను క్లోజ్ గా ఉండటంతో వీరి లవర్స్ తో విడిపోయారు అనే వార్తలు వచ్చాయి. షన్ను, దీప్తి అధికారికంగానే విడిపోతున్నాము అని చెప్పి మరీ విడిపోయారు. అయితే వీరి బ్రేకప్ కి కారణం సిరిని అని, సిరితో క్లోజ్ గా ఉండటమే అని వార్తలు వచ్చాయి.

 

ఆ తర్వాత శ్రీహాన్‌ కూడా సిరి ఫోటోలు డిలీట్‌ చేయడంతో పాటు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ ఒక్కసారి కూడా కలిసి ఉన్న ఫోటో షేర్ చేయలేదు. దీంతో వీరు కూడా విడిపోతున్నట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. శ్రీహన్ కూడా సిరికి బ్రేకప్‌ చెప్పాడు అంటూ, అందుకే వీరిద్దరూ కలవట్లేదు అని అనుకున్నారు అంతా. ఒక్క ఫొటోతో ఇలాంటి రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేసారు సిరి, శ్రీహాన్.

Kangana Ranaut : రియాల్టీ షో హోస్ట్‌గా కంగనా.. ఓటీటీ టెలికాస్ట్

తాజాగా శ్రీహాన్, సిరి కలిసి యాంకర్‌ రవి ఇంటికి వెళ్లి టైం స్పెండ్ చేశారు. రవి ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్‌ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. మీ ఇద్దరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ ని సిరి కూడా షేర్ చేసింది. దీంతో సిరి-శ్రీహాన్‌ల బ్రేకప్‌ వార్తలకు ఇప్పటికైనా స్వస్తి చెప్తాలని ఇండైరెక్ట్ గా వీళ్లిద్దరు తెలిచేశారు.