Sirivennela : పాటల రచయితల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి : చంద్రబోస్

పాటలు ఎంతోమంది రాస్తారు. కానీ పాటల రచయితల కోసం నడుంబిగించి పోరాడిన వ్యక్తి సిరివెన్నెల. మా గేయ రచయితల హక్కులకోసం ఆయన ఎంతో..........

Sirivennela : పాటల రచయితల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి : చంద్రబోస్

Sirivennela Chandrabose

Sirivennela :  తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా అగ్ర స్థానంలో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి, సినీ పరిశ్రమకి తీరని లోటు. ఇవాళ అయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు అంతక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరు స్పందిస్తూ కన్నీరు పెడుతున్నారు. సిరివెన్నెలతో తనకి ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నో విషయాలు తెలియచేసారు మరో గేయ రచయిత చంద్రబోస్.

Sirivennela : ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతిక కాయం.. సినీ ప్రముఖులు, అభిమానుల నివాళి

చంద్రబోస్ మాట్లాడాడుతూ.. ఆయన వ్యక్తిత్వమే కవిత్వం… కవిత్వమే ఆయన వ్యక్తిత్వం. అంత గొప్పగా జీవించిన మనిషి సీతారామశాస్త్రి. పాటే ప్రాణంగా బతికిన రచయిత. ఒక మంచి పాట రాసి వినిపించేవారు. రాస్తే వినేవారు. సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రాసిన ‘దోస్తీ’ పాట గురించి కూడా అరగంట సేపు నాతో మాట్లాడారు. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన నిద్రలేని రాత్రులెన్నో గడిపి మనలో చైతన్యం నింపారు, స్ఫూర్తి రగిలించారు, ప్రేరణ ఇచ్చారు, హితోక్తి పలికారు, ప్రేమ పంచారు, ప్రశ్నించడం నేర్పారు. ఆయన ఓ పాటల గ్రంథాలయం అని అన్నారు.

Sirivennela : ‘సిరివెన్నెల’ నటించిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా?… అది కూడా ఆర్జీవీ దర్శకత్వంలో

పాటలు ఎంతోమంది రాస్తారు. కానీ పాటల రచయితల కోసం నడుంబిగించి పోరాడిన వ్యక్తి సిరివెన్నెల. మా గేయ రచయితల హక్కులకోసం ఆయన ఎంతో శ్రమించారు. నిర్మాతలు, ఆడియో కంపెనీ అధిపతులతో మాట్లాడారు. రచయితల గుర్తింపు, రాయాల్టీ కోసం చట్టాలు చదివి, ఎన్నింటినో అధ్యయనం చేసి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి పాటపై రచయిత హక్కుల కోసం నిరంతర కృషి చేశారు సిరివెన్నెల అని ఆయన గొప్పతనాన్ని తెలియ చేశారు. ‘ఎవరో ఒకరు… ఎపుడో అపుడు’ అని రాసిన సీతా రామశాస్త్రి ఆ పాటకి తగ్గట్టే ఆయనే ముందుండి మమ్మల్ని నడిపించారు అని కన్నీరు పెట్టుకున్నారు చంద్రబోస్.