Sirivennela : ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతిక కాయం.. సినీ ప్రముఖులు, అభిమానుల నివాళి

ఇవాళ ఉదయం సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని ఫిలింఛాంబర్ వద్దకు తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌చాంబర్‌లో ఇవాళ మధ్యాహ్నం వరకు......

Sirivennela : ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతిక కాయం.. సినీ ప్రముఖులు, అభిమానుల నివాళి

Sirivennela Film Chamber

Sirivennela :  ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి ఎనలేని సేవ చేసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణానంతరం భౌతికకాయాన్ని నిన్న రాత్రి కూడా హాస్పిటల్ లోనే ఉంచారు. ఇవాళ ఉదయం సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని ఫిలింఛాంబర్ వద్దకు తరలించారు.

Sirivennela : సిరివెన్నెలకు, త్రివిక్రమ్‌కు మధ్య బంధుత్వం ఏంటో తెలుసా?

సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌చాంబర్‌లో ఇవాళ మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు. ఇప్పటికే రాజమౌళి, చిరంజీవి, గుణశేఖర్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, హీరో వెంకటేశ్‌, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సీనియర్‌ నటులు తనికెళ్ల భరణి, రావు రమేష్‌, అల్లు అరవింద్, మణి శర్మ, ఆచంట గోపినాథ్, పరుచూరి గోపాలకృష్ణ, సునీత, రామ జోగయ్య శాస్త్రి, నందిని రెడ్డి, ఎమ్మెస్ రాజు, అశ్వినిదత్, సాయికుమార్, కళ్యాణ్ మాలిక్, కాసర్ల శ్యామ్, సి కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, డివివి దానయ్య, బుర్ర సాయి మాధవ్, మురళి మోహన్, అల్లు అర్జున్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ నివాళులు అర్పించారు. ఇంకా సినీ రాజకీయ ప్రముఖులు ఫిలింఛాంబర్ కు తరలి వస్తున్నారు.

Sirivennela : ‘సిరివెన్నెల’ నటించిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా?… అది కూడా ఆర్జీవీ దర్శకత్వంలో

11 గంటల తర్వాత సిరివెన్నెల భౌతిక కాయాన్ని మహా ప్రస్థానంకు తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.