Sitara : మీరు ప్ర‌పంచానికి సూప‌ర్ స్టార్, మాకు మాత్రం మీరే ప్ర‌పంచం

Sitara : మీరు ప్ర‌పంచానికి సూప‌ర్ స్టార్, మాకు మాత్రం మీరే ప్ర‌పంచం

Sitara

Sitara : ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ బాబు 46వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనను, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తన అభిమాన నటుడి జన్మదినాన్ని ట్రేండింగ్ లో ఉంచేందుకు టాగ్స్ క్రియేట్ చేసి నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే త‌న తండ్రి బ‌ర్త్ డే సంద‌ర్భంగా సితార చేసిన పోస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. మ‌హేష్‌- న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్ర‌పంచం! పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు మాతో స‌ర‌ద‌గా ఉన్నందుకు ధ‌న్య‌వాదాలు. ఇప్పుడే కాదు ఎప్పుడు మిమ్న‌ల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని సితార త‌న కామెంట్‌లో తెలిపింది.

మహేష్ పుట్టినరోజు సందర్బంగా సర్కారువారి పాట టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృధం. ఈ టీజ‌ర్‌లోని డైలాగ్స్, మ‌హేష్ లుక్ ఫ్యాన్స్ కి పూన‌కం తెప్పిస్తుంది. ఇక మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌రిన్ని అప్‌డేట్స్ నేడు రానున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)