SitaRamam : దాదాసాహెబ్ అవార్డు అందుకున్న సీతారామం.. ఏ కేటగిరీలో తెలుసా?

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సీతారామం క్లాసికల్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా 13వ దాదాసాహెబ్..

SitaRamam : దాదాసాహెబ్ అవార్డు అందుకున్న సీతారామం.. ఏ కేటగిరీలో తెలుసా?

SitaRamam best jury film at 13th Dada Saheb Phalke

SitaRamam : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. యుద్ధం రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా అందరి మనసులను దోచుకుంది. దర్శకుడు స్క్రీన్ ప్లేకి హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. సి అశ్విని దత్త్ 30 కోట్లతో ఈ సినిమాని నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 98 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Nani30 : నాని సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ.. మరి మృణాల్ ఠాకూర్?

ఈ సినిమా సక్సెస్ లో విశాల్ చంద్రశేఖర్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. మ్యూజిక్ లవర్స్ ని మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్ ని కూడా సినిమాలోని పాటలు అలరించాయి. ఇక క్లాసికల్ హిట్టుగా నిలిచిన ఈ మూవీ తాజాగా ప్రముఖ అవార్డుని అందుకుంది. ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో (13th Dada Saheb Phalke International Film Festival) జ్యూరీ క్యాటగిరిలో బెస్ట్ మూవీగా అవార్డుని అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిజేయసింది.

Tollywood : ప్రభుత్వాల పై టాలీవుడ్ నిర్మాతల సంచలన కామెంట్స్.. ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు..

కాగా ఇదే అవార్డ్స్ లో మరో తెలుగు సినిమా కూడా అవార్డుని అందుకుంది. ఈ ఏడాది చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న బలగం (Balagam) సినిమా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకుంది. ఈ సినిమాకి భీమస్ సెసిరోలె (Bheems Ceciroleo) సంగీతం అందించాడు. ఇక ఈ రెండు చిత్రాల మేకర్స్ కి టాలీవుడ్ ప్రముఖులు, ఆడియన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)