హ్యాపీ బర్త్ డే శర్వానంద్ : న్యూ లుక్ వైరల్

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 12:53 PM IST
హ్యాపీ బర్త్ డే శర్వానంద్ : న్యూ లుక్ వైరల్

టాలీవుడ్‌లో యంగ్ హీరోలు హల్ చల్ చేస్తున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలు ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూ అగ్ర హీరోలకు పోటీనిస్తున్నారు. యంగ్ హీరోల్లో ‘శర్వానంద్’ ఒకరు. మార్చి 06వ తేదీన ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు సామాజిక వేదిక ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. బర్త్ డే సందర్భంగా శర్వానంద్ కొత్త చిత్రానికి సంబంధించిన ఓ లుక్ బయటకొచ్చింది.

సుధీర్ వర్మ డైరెక్షన్‌లో శర్వానంద్ నటిస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతోంది. ‘పడి పడి లేచే మనస్సు’ తరువాత శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. శర్వా బర్త్ డే సందర్భంగా మార్చి 06వ తేదీ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ ఓ లుక్ విడుదల చేసింది. శుభాకాంక్షలు తెలియచేసింది. ఇందులో శర్వా డిఫరెంట్‌గా కనిపించడం అభిమానులను అలరించింది. గ్రే హెయిర్ లుక్, స్టైలిష్‌గా కనిపించాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. మేలో సినిమాను రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ ఫిల్మ్‌కి ‘నందూ భాయ్’ అనే టైటిల్ అనుకుంటున్నారంట. మాఫియా డాన్ పాత్ర‌లో శర్వా నటిస్తున్నట్లు టాక్. తాజాగా విడుదల చేసిన లుక్ కూడా అలాగే ఉంది. చివరి దశలో షూటింగ్ ఉంది.