Sivakarthikeyan : ప్రిన్స్ డిస్ట్రిబ్యూటర్లని ఆదుకున్న శివ కార్తికేయన్..

జాతిరత్నాలు మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు అనుదీప్. దీంతో ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు ఆశక్తి చూపించారు హీరోలు, నిర్మాతలు. ఈ క్రమంలోనే తమిళ హీరో శివ కత్తికేయన్ తో కలిసి 'ప్రిన్స్' అనే సినిమా తెరకెక్కించాడు అనుదీప్. అయితే ఈ సినిమా దాదాపు రూ.12 కోట్ల మేర నష్టాలు తెచ్చిపెట్టడంతో..

Sivakarthikeyan : ప్రిన్స్ డిస్ట్రిబ్యూటర్లని ఆదుకున్న శివ కార్తికేయన్..

Sivakarthikeyan returned half of the amount lost by the distributors

Sivakarthikeyan : జాతిరత్నాలు మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు అనుదీప్. దీంతో ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు ఆశక్తి చూపించారు హీరోలు, నిర్మాతలు. ఈ క్రమంలోనే తమిళ హీరో శివ కత్తికేయన్ తో కలిసి ‘ప్రిన్స్’ అనే సినిమా తెరకెక్కించాడు అనుదీప్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ రావు దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

Sivakarthikeyan : శివ కార్తికేయన్ సినిమాకి పని చేస్తున్న అవతార్ టీమ్.. నిజమేనా?

బై లింగువల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో.. భారీ ధరకే కొనుగోలు చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ పరాజయాన్ని ఎదురుకుంది. దాదాపు రూ.12 కోట్ల మేర నష్టాలు వచ్చాయని తెలుస్తుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు శివ కార్తికేయన్ ముందుకు వచ్చాడట.

డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన దానిలో సగం అమౌంట్‌ని హీరో శివ కార్తికేయన్ తిరిగి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త బయటకి రావడంతో.. అందరూ శివ కార్తికేయన్ అభినందిస్తున్నారు. తాజాగా ఈ హీరో ‘ఏలియన్’ అనే సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ మూవీ. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.