Rakul Preet Singh : రకుల్ నుంచి ఒకే సంవత్సరం ఆరు బాలీవుడ్ సినిమాలు

ఈ సంవత్సరం రకుల్ ప్రీత్ సింగ్ చేసిన 7 సినిమాలు రిలీజ్ అవ్వబోతుండగా అందులో ఆరు సినిమాలు బాలీవుడ్ నుంచే కావడం విశేషం. రకుల్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి........

Rakul Preet Singh : రకుల్ నుంచి ఒకే సంవత్సరం ఆరు బాలీవుడ్ సినిమాలు

Rakul Preet Singh (image:instagram)

Rakul Preet Singh :  ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులని అలరించిన రకుల్ ఇక్కడ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసింది. బాలీవుడ్ లో ప్రస్తుతం రకుల్ చాలా బిజీగా ఉంది. ఇప్పటికే స్టార్ హీరోలతో యాక్ట్ చేసిన రకుల్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్లబోతుంది. ఈ సంవత్సరం రకుల్ ప్రీత్ సింగ్ చేసిన 7 సినిమాలు రిలీజ్ అవ్వబోతుండగా అందులో ఆరు సినిమాలు బాలీవుడ్ నుంచే కావడం విశేషం.

కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ చేస్తూ వాయిదా పడిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం ‘ఛత్రీవాలీ’, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తో ‘రన్‌ వే-34’, అజయ్‌ దేవగణ్‌ తో ‘థ్యాంక్‌ గాడ్‌’, ఆయుష్మాన్ ఖురానాతో ‘డాక్టర్‌ జీ’, ‘అటాక్‌’ సినిమాలతో పాటు మరో సినిమాలో కూడా రకుల్ నటిస్తుంది. వీటిలో సగం ఇప్పటికే షూటింగ్ అయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ ఆరు సినిమాలు వరుసగా ఇదే సంవత్సరంలో రిలీజ్ అయితే బాలీవుడ్ లో రకుల్ టాప్ పొజిషన్ కి వెళ్లడం ఖాయం.

AP Online Cinema Tickets : ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే తప్పేంటి?.. ఏపీ ప్రభుత్వంతో ఏకీభవించిన హైకోర్టు

ఇప్పటికే బాలీవుడ్ లో బిజీ అయి తెలుగులో సినిమాలు ఎప్పుడో ఒకటి చేస్తుంది. ఇక ఈ సినిమాలు రిలీజ్ అయి రకుల్ ప్రీత్ మరింత బిజీ అయితే తెలుగు సినిమాలకి పూర్తిగా దూరం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.