Tollywood Senior Heroes: ఏజ్ సిక్స్ టీ ప్లస్.. కానీ కుర్ర హీరోలతోనే పోటీ!

పేరుకు సీనియర్లు.. అందరూ సిక్స్ టీ ప్లస్ ఏజ్ తో ఉన్నవాళ్లు. కానీ.. వీళ్ల క్రేజ్ మాత్రం ఏజ్ కి సంబంధం లేకుండా రోజురోజుకీ పెరిగిపోతోంది. వయసై పోతోంది కదా అని ఓపికున్నప్పుడు ఒకటో..

Tollywood Senior Heroes: ఏజ్ సిక్స్ టీ ప్లస్.. కానీ కుర్ర హీరోలతోనే పోటీ!

Tollywood Senior Heroes

Tollywood Senior Heroes: పేరుకు సీనియర్లు.. అందరూ సిక్స్ టీ ప్లస్ ఏజ్ తో ఉన్నవాళ్లు. కానీ.. వీళ్ల క్రేజ్ మాత్రం ఏజ్ కి సంబంధం లేకుండా రోజురోజుకీ పెరిగిపోతోంది. వయసై పోతోంది కదా అని ఓపికున్నప్పుడు ఒకటో, రెండో సినిమాలు చేద్దాం లే అనుకోకుండా వరసపెట్టి సినిమాల్ని సెట్స్ మీదపెట్టిన స్టార్ హీరోల పెద్దగా హిట్స్ లేకపోయినా ఈ క్రేజ్ కి రీజనేంటి.? వీళ్లకు ఇంకా సినిమా ఛాన్సులు రావడానికి కారణమేంటో తెలుసా..?

Senior Actress: సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన సీనియర్లు.. మళ్ళీ రీఎంట్రీ!

సినిమాల విషయంలో రిలీజ్ ల విషయంలో యంగ్ హీరోలతో పోటీపడుతున్నారు సిక్స్ టీ ప్లస్ హీరోలు. స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లకే టెన్షన పడుతుంటే.. వీళ్లు మాత్రం.. సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా చిల్ బ్రో అంటూ వరసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సీనియర్ హీరోల సినిమాల ఏది రిలీజ్ అయినా మినిమమ్ కలెక్షన్లు గ్యారంటీ, భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ.. అందుకే సౌత్ సీనియర్ హీరోలు ఇంకా ఛాన్సులతో ఫుల్ బిజీ అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఒక వైపు ఆచార్య సినిమాని కంప్లీట్ చేసి ఏప్రిల్ రిలీజ్ కు రెడీ చేస్తూనే.. మరో వైపు మోహన్ రాజా తో గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.

Telugu Senior Heroes: కుర్ర భామలతో రొమాన్స్.. ఏజ్ బార్ హీరోల కష్టాలు

ఇలా ఒక వైపు ఆచార్య, మరో వైపు గాడ్ ఫాదర్ సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. మెహర్ రమేష్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన భోళా శంకర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. మరో వైపు బాబీతో అనౌన్స్ చేసిన 154వ సినిమా వాల్తేరు శీను సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకుంది. ఇలా చిరంజీవి ఆల్రెడీ 4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే వెంకీ కుడుములతో 5వ సినిమాని కూడా అప్పుడే క్యూలో పెట్టేశారు.

Tollywood : సిల్వర్ స్క్రీన్‌పై జాతర.. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు

మరో సిక్స్ టీ ప్లస్ సీనియర్ హీరో బాలకృష్ణ అఖండతో సెంచరీ కొట్టి.. ఇంకా తన క్రేజ్ ని కలెక్షన్లస్టామినా తగ్గ లేదని ప్రూవ్ చేసుకున్నారు. అఖండ అయ్యందో లేదో.. తన 107వ సినిమా మొదలుపెట్టారు. క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనితో సినిమా అనౌన్స్ చేసిన బాలకృష్ణ.. షూటింగ్ ఫుల్ స్పీడ్ లో చేస్తున్నారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కుతున్నఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలకృష్ణకు జంటగా శృతి హాసన్ నటిస్తోంది. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఫస్ట్ టైమ్ కాంబినేషన్ ఎంత మాసివ్ గా ఉండబోతోందో అంటూ ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్.

Young Heroes: కుర్రాళ్ళ యాక్షన్.. డిజాస్టరవుతున్న సినిమాలు!

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పడుతూ లేస్తూ.. సినిమాలు చేస్తున్నారు. ఇంత పాండమిక్ టైమ్ లో సంక్రాంతికి బంగార్రాజు సినిమా రిలీజ్ చేసి మంచి హిట్ అందుకున్నారు. అయితే అంతకుముందు బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్ని ఫేస్ చేసిన నాగార్జునతో సినిమా చెయ్యడానికి రెడీ అయిన కళ్యాణ్ కృష్ణ.. నాగార్జునకి మంచి హిట్టే ఇచ్చాడు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్ టైనర్ ఘోస్ట్ మూవీ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

2022 Summer Movies: ఏప్రిల్ నెలపై కన్నేసిన క్రేజీ ప్రాజెక్ట్స్!

టాలీవుడ్ మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఇంకా చేతినిండా సినిమాలతో, సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ వెంకటేష్, నారప్ప సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయినా కూడా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు కూడా తన సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ ఎఫ్ 2కి సీక్వెల్ ఎఫ్ 3 మూవీతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తో పాటు మినిమం గ్యారంటీ ఉన్న హీరోగా ఓపెనింగ్స్ సాధించే సత్తా ఉంది కాబట్టే.. వెంకీతో సినిమాలు చెయ్యడానికి రెడీగా ఉంటారు డైరెక్టర్లు.