Movie Releases: మహేష్ లాస్ట్.. ఇక సందడంతా చిన్న హీరోలదే! Small Gap to Big Movie Releases after Mahesh Sarkaru Vaari Paata movie

Movie Releases: మహేష్ లాస్ట్.. ఇక సందడంతా చిన్న హీరోలదే!

కొవిడ్ తో ఆగిన, లేట్ అయిన సినిమాలన్నీ వరుసపెట్టి థియేటర్స్ ను టార్గెట్ చేస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత మోస్ట్ అవైటైడ్ సినిమాలన్నీ లెక్కలేసుకుని మరీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

Movie Releases: మహేష్ లాస్ట్.. ఇక సందడంతా చిన్న హీరోలదే!

Movie Releases: కొవిడ్ తో ఆగిన, లేట్ అయిన సినిమాలన్నీ వరుసపెట్టి థియేటర్స్ ను టార్గెట్ చేస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత మోస్ట్ అవైటైడ్ సినిమాలన్నీ లెక్కలేసుకుని మరీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే సర్కారు వారి పాటతో ఈ స్టార్ లీగ్ కు బ్రేక్ పడనుంది. మే థర్డ్ వీక్ నుంచి టాలీవుడ్ సినారియో పూర్తిగా మారనుంది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

Movie Releases: సినిమా పండగ.. ఈ వారం మొత్తం డజను సినిమాలు వచ్చేశాయ్!

మే 12న రిలీజ్ కానుంది సర్కారు వారి పాట. ఈ సినిమాతో ఇప్పటివరకూ కొనసాగిన స్టార్ లీగ్ కు తాత్కాలిక బ్రేక్ పడనుంది. అవును కొవిడ్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గకముందే పుష్ప, అఖండ లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ థియేటర్స్ కొచ్చాయి. హిట్ కొట్టాయి. ఆ తర్వాత మళ్లీ కరోనా భయంతో కొన్ని నెలలు టైమ్ తీసుకున్న టాలీవుడ్ స్టార్స్.. ఒక్కొక్కరిగా పూర్తి స్థాయిలో ఫిబ్రవరి నుంచి రన్ బిగిన్ చేశారు. కరెక్ట్ గా చెప్పాలంటే పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ తో మళ్లీ థియేటర్స్ దగ్గర హడావిడీ కనిపించింది.

Telugu Movie Releases: బాక్సాపీస్ వద్ద కొత్త సినిమాల వాషౌట్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?

హిట్, ఫట్ సంగతి పక్కన పెడితే రాధేశ్యామ్ నుంచి లేటెస్ట్ ఆచార్య వరకు ఎప్పటినుంచో వాయిదాలు పడుతున్న పెద్ద సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇక బాకీ మహేశ్ బాబుదే. పరశురామ్ డైరెక్షన్ లో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించిన సర్కారు వారి పాట మే 12న వచ్చేస్తే.. మళ్లీ పెద్ద స్టార్ లేదంటే బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చేది ఆగస్ట్ లోనే. ఈలోపు అంటే మే 20 నుంచి ఆగస్ట్ 12 వరకు యంగ్ హీరోలే ఫుల్ గా హడావిడీ చేయనున్నారు.

Movie Releases: స్టార్ హీరోల హవా.. చిన్న హీరోల టార్గెట్ ఈ రెండు నెలలే!

మే 20న సత్యదేవ్ నటించిన గాడ్సే రిలీజ్ కాబోతుంది. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాక సరైన హిట్ లేని సత్యదేవ్ గాడ్సేపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇక అదే రోజు నాగశౌర్య హీరోగా తెరకెక్కిన కృష్ణ బృందా విహారి కూడా రాబోతుంది. కోవిడ్ టైమ్ లో ధైర్యం చేసి వరుడు కావలెను, లక్ష్య వంటి సినిమాలను తీసుకొచ్చినా లాభం దక్కని నాగశౌర్య.. కృష్ణ బృందా విహారినే నమ్ముకున్నాడు. మే 20న నాగశౌర్య, సత్యదేవ్ సినిమాలతో పాటూ పెళ్లికూతురు పార్టీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

మే 27.. వెంకటేశ్, వరుణ్ తేజ్.. ఇద్దరినీ టెన్షన్ పెట్టే డేట్. ఈమధ్య తన సినిమాలను ఓటీటీలోనే చూపించిన వెంకీ, గనిపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నా ఫలించని మెగా ప్రిన్స్.. ఇద్దరూ కలిసి మే 27న మరోసారి ప్రేక్షకులకు ఫన్ డోస్ అందించబోతున్నారు. హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ లకు కూడా ఎఫ్3 కీలకమే. పెద్ద సినిమాలతో పోటీ ఎందుకని ఇన్నాళ్లు తప్పించుకున్న అనిల్ రావిపూడి.. ఎఫ్2 సీక్వెల్ కడుపుబ్బా నవ్వించడం ఖాయమంటున్నాడు.

F3: ట్రైలర్ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

మహేశ్ బాబు నిర్మాణంలో యంగ్ హీరో అడివి శేష్ నటించిన మేజర్ పాన్ ఇండియా లెవెల్ చూపించబోతుంది. నేషనల్ వైడ్ ఈ మూవీ జూన్ 3న రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో మేజర్ ను పూర్తి చేసిన మేకర్స్.. మంచి డేట్ కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇక జూన్ 10న అంటే సుందరానికి మూవీని సౌత్ మొత్తం చూపించబోతున్నాడు నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఈ మూవీ టీజర్స్ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి.

Parrot Missing : మా చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి..పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన

సుధీర్ వర్మ డైరెక్షన్ లో రెజీనా, నివేథా థామస్ లీడ్ రోల్స్ చేసిన శాకినీ ఢాకినీ జూన్ 13న రిలీజయ్యే ఛాన్స్ ఉంది. జూన్ 17న రవితేజ మరోసారి థియేటర్స్ ను టార్గెట్ చేశాడు. ఖిలాడీతో ఈ ఇయర్ ఆల్రెడీ డిస్సప్పాయింట్ చేసిన మాస్ రాజా జూన్ 17న రామారావు ఆన్ డ్యూటీతో వస్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ మధ్య బాగా పలకరిస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. జూన్ 24న చాందినీ చౌదరితో ఈ హీరో నటించిన సమ్మతమే రిలీజ్ కానుంది.

Ramarao on Duty: రిలీజ్ డేట్ అనౌన్స్.. రామారావు వచ్చేది ఎప్పుడంటే?

గోపీచంద్ కూడా ఎప్పటినుంచో మంచి డేట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి జూలై 1ని ఫిక్స్ చేసుకుని తను పక్కా కమర్షియల్ గా కనిపించబోతున్నాడు. మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ జోడీగా రాశిఖన్నా నటించింది ఈ సినిమాలో. సేమ్ డే గోపీచంద్ తో పాటూ వైష్ణవ్ తేజ్ తన రంగ రంగ వైభవంగా సినిమాను థియేటర్స్ కి తీసుకొస్తున్నాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ కూడా బాగానే అట్రాక్ట్ చేస్తోంది.

Pakka Commercial: గోపీచంద్.. వైష్ణవ్ తేజ్ రిలీజ్ వార్.. గెలిచేదెవరో?

ఈమధ్య సరైన సక్సెస్ లేని నితిన్ పక్కా మాస్ యాంగిల్ ట్రై చేసి మాచర్ల నియోజక వర్గంలో చూసుకుందాం అంటున్నాడు. ఈ మూవీతో నితిన్ జూలై 8న ఆడియెన్స్ ముందుకు వచ్చేలా ప్రిపేర్ అవుతున్నాడు. జూలై 10న నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబో మూవీ థాంక్యూను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమైన ఎనర్జిటిక్ హీరో రామ్.. ది వారియర్ గా జూలై 14న సందడి చేయబోతున్నాడు. లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ది వారియర్ తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..

జూలై 22న నిఖిల్ కార్తీకేయ 2 డేట్ ఫిక్స్ చేసుకుంది. జూలై 29న అడివి శేష్ హిట్ 2 రిలీజ్ అవుతుందని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 12న అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ ఏజెంట్.. ఆడియెన్స్ ముందుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆగస్ట్ 5 లేదంటే 12న కల్యాణ్ రామ్ హిస్టారికల్ థ్రిల్లర్ బింబిసార విడుదల కానుంది. బింబిసార కల్యాణ రామ్ కెరీర్ కు బూస్టప్ తీసుకొస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

×