Films Releases: పెద్ద సినిమాలున్నా.. తగ్గేదేలే అంటున్న చిన్న సినిమాలు!

పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా.. ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్న పెద్ద సినిమాలన్నీ రాబోయే మూడు నెలల మీద ముందే ఖర్చీఫ్ వేస్కున్నాయి.

Films Releases: పెద్ద సినిమాలున్నా.. తగ్గేదేలే అంటున్న చిన్న సినిమాలు!

Films Releases

Films Releases: పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా.. ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్న పెద్ద సినిమాలన్నీ రాబోయే మూడు నెలల మీద ముందే ఖర్చీఫ్ వేస్కున్నాయి. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ క్లాష్ అవ్వకుండా మరోపెద్ద సినిమా ముందో వెనకో రిలీజ్ పెట్టుకుంటోంది. కానీ చిన్న సినిమాలు మాత్రం.. పెద్ద సినిమాలుంటే మాకేంటి..? మా సినిమాలో దమ్ముందని.. స్టార్ మూవీస్ తో పోటీపడుతున్నాయి.

Ante Sundaraniki: నానీ సినిమాకి ఏడు రిలీజ్ డేట్స్.. పెద్ద చిక్కే!

ఈ సినిమాల రిలీజ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి. కోవిడ్ తో అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి అయితే ఇప్పుడు.. సిచ్యువేషన్ కాస్త బెటర్ అవ్వడంతో ఏమాత్రం లేట్ చెయ్యకుండా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేశాయి. ఇలా వరసగా రిలీజ్ డేట్స్ బ్లాక్ చేసుకున్న భీమ్లానాయక్, ఆచార్య, ఖిలాడి లాంటి స్టార్ సినిమాలతో చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి పోటీపడుతున్నాయి.

Allu Arjun Twitter: తగ్గేదేలే.. రజినీని మించిపోయిన బన్నీ!

వచ్చేవారం ఫిబ్రవరి 11న రిలీజ్ కి రెడీ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు రవితేజ. రమేష్ వర్మ డైరెక్షన్లో రవితేజ డ్యూయల్ రోల్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతోంది. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో ఫామ్ లో ఉన్న రవితేజతో పోటీ పడడానికి ఓటీటీ హీరో డి.జె టిల్లు సినిమాతో రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ఏ ధైర్యంతో ఖిలాడితో పోటీపడుతోందా అని ఆలోచిస్తున్నారు ఫాన్స్.

Stars OTT Entry: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!

అసలు పోటీ అంటే.. ఫిబ్రవరి 25నే . జనవరి పోటీనుంచి తప్పుకున్న భీమ్లానాయక్.. ఫిబ్రవరి 25న రిలీజ్ అని అప్పుడే అనౌన్స్ చేసింది. మార్చి 4న సేఫ్ డేట్ పెట్టుకున్నా.. మ్యాగ్జిమమ్ 25కే వస్తామని హింట్ కూడా ఇచ్చింది. అయినా సరే.. ఫిబ్రవరి 25నే శర్వానంద్ ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమా రిలీజ్ కు డేట్ ఇచ్చేశారు. ఈసినిమాతో పాటు కిరణ్ అబ్బవరం సెబాస్టియర్ పిసి 524 అనే బైలింగ్వల్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. అసలు భీమ్లా బరిలోకి దిగితే.. ఈసినిమాలన్నీ వాష్ అవుట్ అయిపోతాయని తెలిసినా కూడా ఎంత డేర్ గా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారో అనుకుంటున్నారు పవన్ ఫాన్స్.

Unstoppable with NBK స్పెషల్ ప్రోమో.. ఇంత యంగ్ గా ఉన్నావేంటయ్యా బాబు!

రవితేజ.. మరో సినిమా రామారావ్ ఆన్ డ్యూటీ కూడా లేటెస్ట్ గా రెండు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మార్చి 25న కానీ, ఏప్రిల్ 25న కానీ రిలీజ్ అని సేఫ్ గా 2 డేట్స్ ఇచ్చింది. కానీ ఆ రెండు డేట్స్ కి పెద్ద సినిమాల హర్డిల్ ఉంది. మార్చి 25న ట్రిపుల్ ఆర్ ఫైనల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. అలాంటప్పుడు రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా.. రవితేజకు ఇబ్బందే. అలాంటప్పుడు కథ మీద ఉన్న కన్ఫిడెన్సో, లేక రవితేజ మాస్ ఫార్ములానో కలెక్షన్లను డ్రైవ్ చేస్తుందని నమ్ముతున్నారు రామారావ్ టీమ్.

Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

పోయి పోయి మెగాస్టార్ తో పోటీ పడుతున్నారు ఎఫ్ 3 టీమ్. ఆచార్య ఏప్రిల్ 29 రిలీజ్ అవుతుంటే.. ఎఫ్ 3 ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిన ఎఫ్ 2 ఫార్ములా అయినా.. అదే కామెడీ ఫార్ములా చిరంజీవి ముందు పనిచేస్తుందని అనుకోలేం. అదీ కాక ఆచార్య మూవీలో.. చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

MS Dhoni : ‘అధర్వ’గా ధోని.. కత్తి పట్టుకొని కొత్త అవతారం..

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ లో ఉన్న కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్ 3లో కామెడీ ఉన్నా.. ఆచార్యను మించి ఆడియన్స్ ని పుల్ చెయ్యగలదంటే కాస్త డౌటే అంటున్నారు మెగా ఫాన్స్. ఆచార్య రిలీజ్ డేట్ ఫైనల్ అయినా కూడా ఎఫ్ 3 రిలీజ్ డేట్ మార్చే దేలే అని మరో సారి కన్ఫామ్ చేశారు. కానీ తగ్గేదేలే అంటూ ధైర్యంగా పెద్ద సినిమాలతో పోటీపడుతున్నాయి ఈ చిన్న సినిమాలు. మరి పెద్ద సినిమా పవర్ తో చిన్న సినిమాల కాన్ఫిడెన్స్ ఎంత పోటీఇస్తుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.