Hit Movies : హైప్ లేకుండా వచ్చి భారీ హిట్ కొట్టేశాయిగా

భారీ కేస్టింగ్, భారీ సెట్టింగులు చూసి ఎవరూ సినిమాకి రారు. ఆడియన్స్ ను జెన్యూన్ గా థియేటర్స్ కు రప్పించేది కంటెంట్ మాత్రమే. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా కట్టిపడేసే కథాకథనాలుంటేనే..............

Hit Movies : హైప్ లేకుండా వచ్చి భారీ హిట్ కొట్టేశాయిగా

Small movies gets biggest hits

Hit Movies :  ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది బడ్జెట్ కాదు. కంటెంట్ మాత్రమే. వందల కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేశాయి. అలా ఇటీవల కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ లో ఎలాంటి హైప్ లేకుండా వచ్చి భారీ హిట్ కొట్టాయి.

భారీ కేస్టింగ్, భారీ సెట్టింగులు చూసి ఎవరూ సినిమాకి రారు. ఆడియన్స్ ను జెన్యూన్ గా థియేటర్స్ కు రప్పించేది కంటెంట్ మాత్రమే. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా కట్టిపడేసే కథాకథనాలుంటేనే జనం థియేటర్స్ కు వస్తారు. లేకపోతే ఫ్యాన్స్ కూడా ఆ సినిమా మొహం చూడరు. ఈ తరహా సినిమాలకి బడ్జెట్ తో సంబంధం లేదు. పెర్ఫెక్ట్ కంటెంట్ తో సినిమా తీస్తే పెట్టబడికి ఎన్నో రెట్లు లాభాలొస్తాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి కాసుల వర్షం కురిపించాయి.

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది కన్నడ సినిమా ‘కాంతార’. కన్నడ నాట కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా తాజాగా తెలుగులోనూ రిలీజైంది. రిషబ్ షెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన ఈ సినిమా కన్నడ ఏన్షియంట్ కల్చర్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా రూపొందింది. ఈ సినిమాను కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకూ ఈ మూవీ దాదాపు 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. తెలుగులో ఇప్పటికే 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది కాంతర సినిమా.

నిఖిల్ సిద్ధార్ద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన డివోషినల్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. సూపర్ హిట్ కార్తికేయ మూవీకిది సీక్వెల్. చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకి బడ్జెట్ కేవలం 15 కోట్లు మాత్రమే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ అయి పెట్టుబడికి ఎన్నో రెట్ల వసూళ్ళతో తెలుగులో, బాలీవుడ్ లో దూసుకుపోయింది. కార్తికేయ 2 సినిమా దాదాపు 120 కోట్లని కలెక్ట్ చేసింది.

Pawan kalyan : మొదటి భార్యకి 5 కోట్లు ఇచ్చాను, రెండో భార్యకి ఆస్తి ఇచ్చాను.. మూడు పెళ్లిళ్లపై స్పందించిన పవన్..

నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జోడీగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ కథాంశంతో ఆడియన్స్ ను అడుగడుగునా థ్రిల్ చేసిన ఈ మూవీ కోసం రూ. 40 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పెట్టుబడికి రెట్టింపు పైగానే కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్చపరిచింది. కళ్యాణ్ రామ్ కు మంచి కమ్ బ్యాక్ మూవీగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది సినిమా. డ్యూయల్ రోల్ తో కళ్యాణ్ రామ్ ఆద్యంతం కట్టిపడేశాడు. ఎప్పటి నుంచో సరైన సక్సె్స్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కి 100 కోట్ల కలెక్షన్స్ ఇచ్చి అతని కెరీర్ కి బూస్టప్ ఇచ్చింది.

మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జోడీగా హను రాఘవపూడి తెరకెక్కించిన వార్ అండ్ లవ్ స్టోరీ ‘సీతారామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఈ సినిమాకి దాదాపు రూ. 30 కోట్లు ఖర్చుపెట్టారు. పెట్టుబడికి మూడు రెట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ తో ఇంతవరకు మలయాళంలో కూడా ఈ రేంజ్ బడ్జెట్ లో ఎవరూ సినిమా తీయలేదు. అద్భుతమైన కంటెంట్ కు తోడు దుల్కర్, మృణాల్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులని మళ్ళీ మళ్ళీ థియేటర్ కి రప్పించి ఈ సినిమా. సీతారామం సినిమా కూడా దాదాపు 100 కోట్లను కలెక్ట్ చేసింది. ఇలా ఏ హైప్ లేకుండా, తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు ఈ సంవత్సరం భారీ విజయం సాధించాయి.