Small Movies : 2022.. చిన్న సినిమాల సంవత్సరం..

వందల కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేశాయి. చిన్న సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి కాసుల వర్షం కురిపించాయి. టాలీవుడ్ లోనే కాదు వేరే భాషల్లోనూ.................

Small Movies : 2022.. చిన్న సినిమాల సంవత్సరం..

Small Movies gets Biggest hits in 2022

Small Movies :  ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది బడ్జెట్ కాదు కంటెంట్ మాత్రమే. వందల కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేశాయి. చిన్న సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి కాసుల వర్షం కురిపించాయి. టాలీవుడ్ లోనే కాదు వేరే భాషల్లోనూ ఇండియన్ హిస్టరీలో ఎప్పుడూ లేనంత హ్యూజ్ సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్నాయి చిన్న సినిమాలు.

వందల కోట్ల ఖర్చు పెట్టినా అసలేమాత్రం పట్టించుకోని ఆడియన్స్ కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని మాత్రం సూపర్ హిట్ చేశారు. లేటెస్ట్ గా వచ్చిన 18 పేజెస్ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా హ్యూమన్ యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 18 పేజెస్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

ఈ సంవత్సరం తెలుగు సినిమాకి మంచి బోణీ కొట్టి బూస్టప్ ఇచ్చిన సినిమా డి.జె.టిల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా, ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ని, స్పెషల్ గా యంగ్ జనరేషన్ ని విపరీతంగా ఆకట్టుకుంది DJ టిల్లు. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 30 కోట్ల కలెక్షన్లు రాబట్టి హిట్ అయి సర్ ప్రైజ్ చేసింది.

 

సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన చిన్న సినిమా కార్తికేయ 2. నిఖిల్ హీరోగా, చందూ మొండేటి డైరెక్షన్లో డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కార్తికేయ2 సినిమా 15 కోట్లతో తెరకెక్కి 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అసలు బాలీవుడ్ లో రిలీజ్ చెయ్యడానికి ధియేటర్లే లేని స్టేజ్ నుంచి దాదాపు 300లకు పైగా ధియేటర్లో రన్ అయ్యి బాలీవుడ్ లోనే 50 కోట్ల కలెక్షన్లు సాధించింది కార్తికేయ 2.

నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జోడీగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘బింబిసార’. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఆడియన్స్ ను అడుగడుగునా థ్రిల్ చేసిన ఈ మూవీ కోసం రూ. 40 కోట్ల బడ్జెట్ కేటాయించగా దాదాపు 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్చపరిచింది. కళ్యాణ్ రామ్ కు మంచి కమ్ బ్యాక్ మూవీగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది సినిమా.

మల్లూ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జోడీగా హను రాఘవపూడి తెరకెక్కించిన వార్ అండ్ లవ్ స్టోరీ ‘సీతారామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఈ సినిమాకి దాదాపు రూ. 25 కోట్లకు పైనే ఖర్చుపెట్టారు. పెట్టుబడికి మూడు రెట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. అద్భుతమైన కంటెంట్ కు తోడు, దుల్కర్, మృణాల్ సూపర్ పర్ఫార్మెన్స్ కాసుల వర్షం కురిసింది.

ఇవే కాక మేజర్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఒకే ఒక జీవితం, కృష్ణ వ్రింద విహారి, స్వాతిముత్యం, ఊర్వశివో రాక్షసివో, హిట్ 2, యశోద, మాసూద.. లాంటి పలు చిన్న సినిమాలు కూడా మంచి విజయం సాధించి లాభాలు రాబట్టాయి. మొత్తంగా టాలీవుడ్ లో ఈ సంవత్సరం ఎక్కువగా చిన్న సినిమాలే విజయం సాధించాయి.

Alia Bhatt : తలకిందులుగా యోగా చేస్తూ అలియా భట్.. పిల్లలు పుట్టినా సరే.. బాడీని జాగ్రత్తగా ఉంచుకోవాలి..

ఇలా తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సారి చిన్న సినిమాలే ఎక్కువగా విజయం సాధించాయి. లవ్ టుడే, తిరు, కాంతార, చార్లి 777, జయ జయ జయ జయహే, హృదయం, కూమన్, సూపర్ శరణ్య, మేప్పడియాన్, కశ్మీర్ ఫైల్స్.. ఇలా పలు చిన్న సినిమాలు వేరే భాషల్లో కూడా మంచి విజయాలు సాధించాయి.