Sankranthi Releases: పెద్ద పండక్కి మేమున్నామంటున్న చిన్న సినిమాలు!

కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అఖండ, పుష్ప 100 కోట్లను సింపుల్ గా క్రాస్ చేసి అదిరిపోయే సక్సెస్ ఇచ్చాయి. ఆ జోష్ ని మరిపించేలా సంక్రాంతి వరకు ట్రిపుల్ ఆర్ రచ్చ చేస్తుందనుకుంటే మధ్యలోనే..

Sankranthi Releases: పెద్ద పండక్కి మేమున్నామంటున్న చిన్న సినిమాలు!

Sankranthi Releases

Sankranthi Releases: కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అఖండ, పుష్ప 100 కోట్లను సింపుల్ గా క్రాస్ చేసి అదిరిపోయే సక్సెస్ ఇచ్చాయి. ఆ జోష్ ని మరిపించేలా సంక్రాంతి వరకు ట్రిపుల్ ఆర్ రచ్చ చేస్తుందనుకుంటే మధ్యలోనే చేతులెత్తేసింది. అయితే మరేం పర్వాలేదు.. సంక్రాంతికి మేము పక్కా అంటున్నారు వీళ్లు. పెద్ద పండక్కి మా బొమ్మ పడటం ఖాయమంటున్నారు. ట్రిపుల్ ఆర్ వాయిదా హడావిడీ మధ్య సంక్రాంతికి మేము రావడం పక్కా అన్నారు రాధేశ్యామ్ మేకర్స్.

Release Crash: కొత్త డేట్స్.. కొత్త క్లాషెస్.. మళ్లీ గందరగోళమేనా?

జనవరి 14న మీరు ఫిక్స్ అయిపోండని డార్లింగ్ ఫ్యాన్స్ కి చెప్పేశారు. సౌత్ టు నార్త్ రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ కూడా ట్రిపుల్ ఆర్ బాట పడుతుందనుకున్నారు. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో పెద్ద పండక్కి గ్లోబల్ స్టార్ రావడం కష్టమే అన్న మాటలు వినిపించాయి. కానీ సంక్రాంతికి ప్రభాస్ సినిమాను ఎంజాయ్ చేస్తారని యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కొత్త పోస్టర్ వదిలి మరీ ఈ న్యూ ఇయర్ ఫస్ట్ రోజున ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు.

Radhe Shyam: ఎక్కడో ఏదో టెన్షన్.. జనవరి 14నే రాధేశ్యామ్ వస్తుందా?

నిన్నమొన్నటి వరకు కమింగ్ సూన్ అన్న బంగార్రాజు సంక్రాంతి బరిలో దూకడం ఖాయమనేశాడు. జనవరి ఫస్ట్ స్పెషల్ గా వదిలిన టీజర్.. సంక్రాంతికి బంగార్రాజు థియేటర్స్ లో ఉంటాడని చెప్పేసింది. అక్కినేని హీరోలు ఎయిమ్ చేసింది తెలుగు రాష్ట్రాలనే కాబట్టి పెద్దగా నష్టం లేదు. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు కూడా తక్కువే. పైగా పండక్కి పెద్ద పోటీ ఉండేలా కనిపించడం లేదు. సోగ్గాడు కాస్త రెచ్చిపోయినా సరే.. సంక్రాంతి విన్నర్ కావడం చాలా ఈజీ. అటు ఇటు చేసి మధ్యలో అందుకోవడం అంటే ఇప్పుడు బంగార్రాజు చేసేదే.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

జనవరి 13న తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది అజిత్ వాలిమై. కార్తీకేయ విలన్ గా నటిస్తున్నాడు ఈ సినిమాలో. తమిళ్ లో ఎలాగూ అజిత్ కి ఫుల్ మార్కెట్ ఉంది. ఫ్యాన్స్ సైతం ఎప్పుడెప్పుడా అని వాలిమై కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ వరకు తమిళనాడు గవర్నమెంట్ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీని ఎత్తేస్తే వాలిమైకి హ్యూజ్ కలెక్షన్స్ దక్కుతాయి. ఇటు తెలుగులో పోటీ పెద్దగా లేకపోతే నిర్మాత బోనీకపూర్ మంచి లాభాలనే అందుకుంటాడు.

Kajal Agarwal : తల్లి కాబోతున్న కాజల్.. అధికారికంగా ప్రకటించిన గౌతమ్

దాంతో పాటు గుంటూరు టాకీస్ హీరో సిద్ధూ, భీమ్లా నాయక్ మేకర్స్ ‘డీజే టిల్లు’ సినిమా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ ‘హీరో’ కూడా జనవరి 15న సంక్రాంతికి రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ జనవరి 14న అనౌన్స్ చేయగా దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రాబోతున్న ‘రౌడీ బాయ్స్’, ఎమ్మెస్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ‘7 డేస్ 6 నైట్స్’ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు.