Small Movies : విడుదలకు సిద్ధమైన సినిమాలు..

పెద్ద సినిమాలు వచ్చేలోపే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి, సేఫ్ అయిపోదామనుకుంటున్నాయి..

Small Movies : విడుదలకు సిద్ధమైన సినిమాలు..

Small Movies

Small Movies: థియేటర్లు ఇప్పుడిప్పుడే ఓపెన్ చెయ్యడంతో సినిమాలు ఇప్పుడిప్పుడే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసకుంటున్నాయి. పెద్ద సినిమాలు వచ్చేలోపే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి, సేఫ్ అయిపోదామనుకుంటున్నాయి. సో.. బాక్సీఫీస్ సందడి స్టార్ట్ చెయ్యబోతున్న సినిమాలేంటో చూద్దాం.

టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ సందడి స్టార్ట్ అయ్యింది. వన్ బై వన్ సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఈ నెల 23 నుంచే కొత్త సినిమాలు వెయ్యడానికి రెడీ అయినా.. ఇంకా మేకర్స్ మాత్రం అప్పుడే థియేటర్లోకి వచ్చే రిస్క్ తీస్కోవడం లేదు. అందుకే, ఒక వారం ఆగి.. జూలై 30 నుంచి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత పెద్ద స్క్రీన్ మీద సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్న వాళ్లకి నెక్ట్స్ వీక్ ఛాయిస్ చాలానే ఉంది.

Movie Theatres : తెలంగాణా థియేటర్స్‌లో బొమ్మ పడలేదు..

డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియన్స్‌కి దగ్గరవుతున్న సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ నటించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మూవీ ‘తిమ్మరుసు’. సత్యదేవ్ లాయర్ రోల్ చేస్తున్న ‘తిమ్మరుసు’ సినిమా కూడా జూలై 30నే రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ‘జాంబి రెడ్డి’ తో మంచి హిట్ అందుకున్న తేజా సజ్జా కూడా ఈనెలలోనే రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు.

తేజా సజ్జా , ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ‘ఇష్క్’ (not a love story). ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో అనుకున్నా.. థియేటర్లు బంద్ అవ్వడంతో ఓటీటీలోకి వస్తుందేమో అనుకున్నారు. కానీ ‘ఇష్క్’ మాత్రం థియేటర్లోకే వస్తున్నాం అంటూ జూలై 30న డేట్ అనౌన్స్ చేసింది.

మరో చిన్న సినిమా ‘నరసింహపురం’ కూడా వచ్చే వారమే ఆడియన్స్ ముందుకొస్తోంది. ‘నరసింహపురం’ సినిమా ముందు జూలై 23నే రిలీజ్ అనౌన్స్ చేసినా.. ఎందుకైనా మంచిదని జూలై 30కి రిలీజ్ పోస్ట్‌పోన్ చేసుకుంది. పెద్ద సినిమాలు వచ్చేలోపే రిలీజ్ అయ్యి సేఫ్ అయిపోవాలని ముందు జాగ్రత్తగానే మంచి టైమ్ చూసి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి చిన్న సినిమాలు.