Riya Chakravarthi: సుశాంత్ కేసులో రియాకి చిన్న రిలీఫ్..

ఎన్సీబీ విచారణలో భాగంగా రియా చక్రవర్తిని అరెస్ట్‌ చేసింది. ఆ సమయంలో ఆమె ఫోన్స్ ని, గాడ్జెట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సుమారు నెల రోజులు జైలులో

Riya Chakravarthi: సుశాంత్ కేసులో రియాకి చిన్న రిలీఫ్..

Sushanth Riya

Riya Chakravarthi:  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనేక మలుపులతో ఈ కేసు సిబిఐ చేతికి వచ్చింది. మొదటి నుంచి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని సుశాంత్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపించడంతో సుశాంత్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లగా తీవ్ర విచారణ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఆమె ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఫిర్యాదు చేశారు.

Sushanth sing Rajput : సుశాంత్ గూగుల్, పేస్ బుక్, వాట్సాప్ డేటా కావాలి.. సుశాంత్ కేసులో మరో మలుపు

ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం కూడా ఉండటంతో సిబిఐతో పాటు ఎన్సీబీ కూడా దర్యాప్తు చేపట్టింది. సుశాంత్‌ కేసులో డ్రగ్స్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ విచారణలో భాగంగా రియా చక్రవర్తిని అరెస్ట్‌ చేసింది. ఆ సమయంలో ఆమె ఫోన్స్ ని, గాడ్జెట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సుమారు నెల రోజులు జైలులో ఉన్న రియాకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బయటకి వచ్చింది. ఆమె బయటకి వచ్చినా ఇంకా రియా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఉంచారు. ఆమె ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఎన్సీబీ దగ్గరే ఉంచారు.

Hyper Aadi : ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వాళ్ళందర్నీ.. సైలెంట్ గా హైపర్ ఆది సెటైర్

ఇటీవల తన బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్‌ చేయాలని కోరుతూ ఎన్సీబీ ప్రత్యేక కోర్టులో రియా అప్లికేషన్‌ దాఖలు చేసింది. తన జీవనశైలికి, తన తమ్ముడిని చూసుకోవడానికి తనకు బ్యాంక్ ఖాతా అవసరమని పిటిషన్‌ ద్వారా కోర్టును అభ్యర్థించింది. ఈ కేసు తేలేందుకు చాలా కాలం పడుతుందని, అప్పటి వరకు రియా బ్యాంకు ఖాతాను స్తంభించడం అనవసరమని ఆమె తరుఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఎన్సీబీ తరపున కూడా న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ తర్వాత రియా బ్యాంక్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్తంభింపజేయడానికి ఎన్సీబీ వైపు నుండి బలమైన అభ్యంతరం లేనందున కొన్ని షరతులతో రియా బ్యాంక్ ఖాతా, ఎఫ్డీలను అన్‌ఫ్రీజ్ చేయాలనీ కోర్టు తెలిపింది.

Shyam Singha Roy: నాని కోసం రాసిన కథ కాదు.. రిజక్ట్ చేసిన హీరో ఎవరంటే?

మరోవైపు రియా నుంచి స్వాధీనం చేసుకుని మొబైల్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌, మరికొన్ని గ్యాడ్జెట్స్ ను లక్ష రూపాయల బాండ్‌ తీసుకొని వాటిని రియాకు తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దాదాపు ఏడాది తర్వాత ఆమె బ్యాంకు ఖాతాలు డీఫ్రీజ్‌ కాగా, స్వాధీనం చేసుకున్న గాడ్జెట్‌లు కూడా తిరిగి వచ్చాయి.