తారక్ ఫ్యామిలీతో హోలీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకాభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలియచేశాడు..

  • Published By: sekhar ,Published On : March 10, 2020 / 05:37 AM IST
తారక్ ఫ్యామిలీతో హోలీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకాభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలియచేశాడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు, ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియచేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ తార‌క్ అంద‌రికీ హోలీ విషెస్ తెలిపాడు.

అందరూ వైట్ డ్రెస్‌లో ముఖానికి రంగులు పూసుకుని ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలిద్దరూ భలే క్యూట్‌గా ఉన్నారు. తారక్ ఫ్యాన్స్ లైక్స్, రీ ట్వీట్స్‌తో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ట్రెండింగ్‌లో ఉంది.

రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి తార‌క్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. తర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్న సినిమా మే నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. 

See More :

ఉత్సాహం ఉంటే వయసుతో పనేముంది!

ఆహా.. అనిపిస్తున్న యాప్: OTT రంగంలో సరికొత్త రికార్డులు

నలుగురు పిల్లలు.. నీకు వేరే పనిలేదా? అంటూ ఆటపట్టిస్తున్నారు..