Toolsidas Junior : స్నూకర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మొదటి సినిమా..

స్నూకర్ నేపథ్యంలో మొట్టమొదటి సినిమా రాబోతుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో స్నూకర్ ని చూపించారు. బాగా డబ్బున్న వాళ్ళు ఆడే ఆటగా మన తెలుగు సినిమాల్లో కూడా చూపించారు. అయితే...........

Toolsidas Junior : స్నూకర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మొదటి సినిమా..

Snooker

Toolsidas Junior :  ఇటివల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చాలా వస్తున్నాయి. ఇప్పటికే ఆటల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించాయి. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమలలోను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే క్రికెట్, బాక్సింగ్, ఫుట్ బాల్, కబడ్డీ, హాకీ… ఇలా పలు రకాల స్పోర్ట్స్ కథలతో సినిమాలు వచ్చాయి. తాజాగా మరో గేమ్ నేపథ్యంలో మొదటి సినిమా రాబోతుంది.

స్నూకర్ నేపథ్యంలో మొట్టమొదటి సినిమా రాబోతుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో స్నూకర్ ని చూపించారు. బాగా డబ్బున్న వాళ్ళు ఆడే ఆటగా మన తెలుగు సినిమాల్లో కూడా చూపించారు. అయితే ఇప్పటిదాకా సినిమాల్లో స్నూకర్ ఏదో సరదాగా ఆడినట్టు చూపించారు. కానీ మొట్టమొదటి సారిగా స్నూకర్ ని కూడా ఒక ఆటలా, పోటీలు జరుగుతాయని, మంచి ఎమోషన్స్ ఉండే గేమ్ లా చూపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు మృదుల్ ‘తులసీదాస్ జూనియర్’ అనే పేరుతో స్నూకర్ నేపథ్యంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Sunny Leone : పెళ్లి టైంలో చేతిలో డబ్బులు లేవు.. గెస్టులు ఇచ్చిన గిఫ్టులతో రిసెప్షన్ బిల్లులు కట్టాం..

టీ సిరీస్ సంస్థతో కలిసి ప్రముఖ దర్శకుడు అషుతోష్ గోవారికర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దివంగత రాజీవ్ కపూర్, వరుణ్ బుద్ధదేవ్, సంజయ్ దత్ దీంట్లో ప్రధాన పాత్రల్లో నటించారు. 1994 సంవత్సరంలో జరిగిన కథగా దీన్ని చిత్రీకరించారు. తండ్రి తులసీదాస్ ఓ స్నూకర్ క్రీడాకారుడు. ఓ కీలక మ్యాచ్ లో ఓడిపోయి బాధతో ఆటకు దూరమవుతాడు, దీంతో తన తండ్రి కలను నెరవేర్చాలని కొడుకు జూనియర్ తులసీదాస్ శ్రమిస్తాడు. ఈ కథతో త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kirak RP : కిరాక్ ఆర్పీ ఇల్లు చూశారా?.. స్టార్ సెలబ్రిటీలను మించి..

ఇందులో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషించగా, ఇక రాజీవ్ కపూర్ చనిపోయేముందు నటించిన చివరి చిత్రం ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ జూనియర్ తులసీదాస్ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇప్పటివరకు స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.