Sobhita Dhulipala : సౌత్ వర్సెస్ నార్త్ గొడవ ఇప్పటిదేం కాదు.. ఎప్పట్నుంచో ఉంది.. కానీ

ఇటీవల సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల చర్చ గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. పలు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా భారీ విజయం సాధించడంతో ఈ చర్చ బాగా ఎక్కువైంది. ఇక సాధారణంగా, రాజకీయంగా కూడా మన దేశంలో సౌత్ వర్సెస్ నార్త్ చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తాజాగా శోభిత దీనిపై స్పందించింది.

Sobhita Dhulipala : సౌత్ వర్సెస్ నార్త్ గొడవ ఇప్పటిదేం కాదు.. ఎప్పట్నుంచో ఉంది.. కానీ

Sobhita Dhulipala comments on South Vs North Issue

Sobhita Dhulipala :  తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ హిందీ(Hindi) సినిమాలతో పేరు తెచ్చుకొని అనంతరం తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. చివరగా పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) సినిమాలో కనిపించింది శోభిత. ప్రస్తుతం ఓ హిందీ సినిమాతో పాటు, ఓ హాలీవుడ్(Hollywood) సినిమా కూడా చేసింది. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సౌత్ వర్సెస్ నార్త్ సినిమాల గొడవ గురించి కూడా మాట్లాడింది.

ఇటీవల సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల చర్చ గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. పలు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా భారీ విజయం సాధించడంతో ఈ చర్చ బాగా ఎక్కువైంది. ఇక సాధారణంగా, రాజకీయంగా కూడా మన దేశంలో సౌత్ వర్సెస్ నార్త్ చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తాజాగా శోభిత దీనిపై స్పందించింది.

Pavithra Lokesh : పవిత్ర లోకేష్‌తో పరీక్ష రాయించిన నరేష్.. ఇప్పుడు కూడా పవిత్ర చదువుకుంటుందా?

శోభిత మాట్లాడుతూ.. ఇది కొత్తగా వచ్చిన ఫైట్ అని నేను అనుకోను. ఇటీవల సౌత్ సినిమాల సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది కాబట్టి, మీడియా దాని మీద ఫోకస్ చేయడంతో ఈ సౌత్ వర్సెస్ నార్త్ చర్చ ఎక్కువగా వినిపిస్తుంది. కానీ స్వతత్రంకి ముందు నుంచే ఈ సౌత్ వర్సెస్ నార్త్ అనే చర్చ జరుగుతోంది. ఒక క్రికెట్ జట్టుకి దేశమంతా ఒక్కటిగా ఉన్నా మళ్ళీ మాలో మాకు చాలా విబేధాలు ఉంటాయి, చాలా భిన్నంగా ఉంటాము. చాలా రాష్ట్రాలు ఉండటంతో మా ఆహరం, సంసృతి, భాషలు.. ఇలా అన్ని వేరుగా ఉన్నప్పుడు ఆ చర్చలు కచ్చితంగా వస్తాయి. మనం వాటిని గుర్తించి అంతా భారతదేశమే అని భావించాలి అంటూ తెలిపింది.