మహేష్ ‘లేజీ’.. ఎన్టీఆర్ ‘క్రేజీ’.. సారీ చెప్పాల్సిందేనంటున్న సూపర్‌స్టార్ ఫ్యాన్స్..

  • Published By: sekhar ,Published On : August 1, 2020 / 01:06 PM IST
మహేష్ ‘లేజీ’.. ఎన్టీఆర్ ‘క్రేజీ’.. సారీ చెప్పాల్సిందేనంటున్న సూపర్‌స్టార్ ఫ్యాన్స్..

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్, హరిచందన హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.



UmaMaheswara UgraRoopasya

అయితే తాజాగా ఈ సినిమాపై వివాదం నెలకొంది. ఇందులో కొన్ని సీన్లు తొలగించాలి అలాగే క్షమాపణలు చెప్పాలి అంటూ మహేష్ ఫ్యాన్స్ మూవీ టీమ్‌ని హెచ్చరించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగా ఫైర్ అవుతున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్.. వాళ్లంతలా హర్ట్ అవడానికి కారణం ఏంటో తెలుసా?



UmaMaheswara UgraRoopasya

అమ్మాయి మహేష్ ఫ్యాన్.. అబ్బాయి తారక్ ఫ్యాన్..
ఈ సినిమాలో సుహాస్ ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి మహేష్ బాబు అభిమాని. సుహాస్ ఏమో ఎన్టీఆర్ ఫ్యాన్.. ఓ సీన్‌లో వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. ‘మహేష్ బాబు అయితే ఉన్న చోట నుండి కదలకుండా చంపేస్తూ ఉంటాడు..‘వెరీ లేజీ’, అదే ఎన్టీఆర్ అనుకో వెంటపడి మరీ నరికేస్తుంటాడు.. ‘సో క్రేజీ’ అంటూ ఓ డైలాగ్ చెబుతాడు సుహాస్.

నెగెటివ్ టాక్ స్ప్రెడ్..



మరో సీన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన సుహాస్.. మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడు. అమ్మాయి: నువ్వేంటి మొదటిరోజు మహేష్ బాబు సినిమాకొచ్చావ్? అని అడిగితే.. సుహాస్:
‘‘సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా ట్విట్టర్లో రెచ్చిపోతాం’’.. అని చెబుతాడు. దానికి కౌంటర్‌గా ‘‘మీ ఎన్టీఆర్ సినిమా విడుదలైనప్పుడు మీ సంగతి చెబుతానని’’ ఆ అమ్మాయి అంటుంది.Suhas

ఇలా తమ హీరోని లేజీ అన్నందుకు సత్యదేవ్, వెంకటేష్ మహాలపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ సీన్లను డిలీట్ చేయండి లేదా డైరెక్టర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #UMURteamShouldApologizeMaheshBabu అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.



ఎన్టీఆర్ క్రేజీ అనే డైలాగుతో తారక్ ఫ్యాన్స్ రెచ్చిపోతుంటే.. మహేష్ డూప్ లేకుండా స్టంట్స్ చేస్తాడని గతంలో కృష్ణ చెప్పిన మాటలను మహేష్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..