Sohel serious : సొహైల్ గొడవ..చివరిలో ట్విస్ట్..వీడియో వైరల్

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న సొహైల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తోంది.

Sohel serious : సొహైల్ గొడవ..చివరిలో ట్విస్ట్..వీడియో వైరల్

Sohail

Sohel New Movie : బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న సొహైల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తోంది. ఓ వ్యక్తితో విపరీతంగా గొడవ పడుతుండడం, కొడుతానంటూ..హెచ్చరిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇతరులు వారిస్తున్నా..సొహైల్ రెచ్చిపోతున్న ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. అసలు సొహైల్ కు ఎందుకుంత కోపం వచ్చింది ? ఏమిటా కారణం ? అయితే..చివరిలో జరిగిన ట్విస్ట్ తో అందరూ ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ 4 రియాల్టీ షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు సొహైల్. ఇతను తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి ప్రాంతానికి చెందిన వాడు. ప్రస్తుతం ఇతను హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. సూనిమా షూటింగ్ కొనసాగుతోంది.

లోకేషన్ కు చేరుకున్న సొహైల్..చిత్ర యూనిట్ లో ఉన్న ఓ వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. చిన్నపాటి ఘర్షణే జరిగింది. లోకేషన్ లో ఉన్న సభ్యులు ఎంత వారించినా..సొహైల్ వినిపించుకోలేదు. చివరకు కొట్టే స్థాయి వరకు చేరుకుంది. ఇరువురు పెద్ద పెద్దగా కేకలు వేసుకోవడంతో చిత్ర యూనిట్ లో ఉన్న వారు అందరూ భయపడిపోయారు. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ లో వారిలో నెలకొంది. షాక్ కు గురైన నిర్మాత..తనకు ఇలాంటివి నచ్చవని, వెంటనే గొడవ ఆపాలని ఇద్దరికీ సూచించారు. అక్కడనే ఉన్న హీరోయిన్ చూసి బిత్తరపోయింది. చివరిలో ఇదంతా నిజం కాదని…కేవలం ప్రాంక్ కోసమే..మాత్రమే గొడవ పడడం జరిగిందని సొహైల్ వెల్లడించడంతో అవాక్కయ్యారు. నిర్మాతతో పాటు..హీరోయిన్ కు అసలు తెలియదని సొహైల్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారిపోయింది.

ఇక సినిమా విషయానికి వస్తే…మైక్ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభమైంది. సొహైల్ సరసన రూప కొడువయార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ లాంటి సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మైక్ మూవీస్ మరో వినూత్న కథతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది.