‘సోలో సోదర సోదరీమణులారా.. మన slogan ఒకటే’..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మే 1న విడుదల..

10TV Telugu News

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మే 1న విడుదల..

ఇటీవల ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో ఆకట్టుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నభా నటేష్ కథానాయిక.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేది ప్రకటిస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. కార్మికుల దినోత్సవం నాడు 2020 మే 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే వాలెంటైన్స్ వీకెండ్ ఈ మూవీలోని ‘సోలో బ్రతుకే సో బెటర్ థీమ్ వీడియో’ రిలీజ్ చేయనున్నారు.

‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ valentines weekend మనం అంతా కలిసి జరుపుకుందాం.. మన slogan ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ తేజ్ ట్వీట్ చేశాడు. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : వెంకట్ సి దిలీప్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా.