83 Film: సమ్ థింగ్ స్పెషల్ ’83’.. ఫస్ట్ వరల్డ్ కప్ నాటి ఉత్కంఠ!

ఇండియన్స్ ఫస్ట్ వరల్డ్ కప్ కోసం ఎంతగా వెయిట్ చేశారో.. 83 సినిమా కోసం ఆడియన్స్ అంతగా వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న 83 సినిమా ఈ క్రిస్ మస్..

83 Film: సమ్ థింగ్ స్పెషల్ ’83’.. ఫస్ట్ వరల్డ్ కప్ నాటి ఉత్కంఠ!

83 Film

83 Film: ఇండియన్స్ ఫస్ట్ వరల్డ్ కప్ కోసం ఎంతగా వెయిట్ చేశారో.. 83 సినిమా కోసం ఆడియన్స్ అంతగా వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న 83 సినిమా ఈ క్రిస్ మస్ కి గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చాలా స్పోర్ట్స్ డ్రామాలు బాలీవుడ్ లో వచ్చినా.. లేటెస్ట్ గా అన్ని ఎమోషన్స్ తో వచ్చిన 83 ట్రైలర్ అన్నింటికంటే సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంటోంది.

Lakshya: తప్పించి గెలవాలా? తప్పుడు దారిలో గెలవాలా?

ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. క్రికెట్ మ్యాచ్ ఉందంటే పనులు మానేసుకుని, ఉద్యోగాలకు సెలవు పెట్టుకుని మరీ క్రికెట్ చూసేంత పిచ్చి అభిమానం ఇండియన్స్ సొంతం. అసలు ఇండియన్స్ కి క్రికెట్ అంటే గేమ్ కాదు ఎమోషన్. ఏ దేశానికైనా ఎన్ని మ్యాచ్ లు గెలిచినా..వరల్డ్ కప్ గెలిస్తేనే కంప్లీట్ గా శాటిస్ఫై అవుతారు. అయితే దాదాపు 38 ఏళ్ల క్రితం 1983లో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లి వరల్డ్ కప్ సాధించింది ఇండియా. అప్పటి బెస్ట్ మూమెంట్స్ ని కళ్లకు కట్టినట్టు.. ఎలా రిక్రియేట్ చేశారో చూపించడానికి డిసెంబర్ 24న రాబోతోంది.

Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. ఒకేసారి 3 సినిమాలకు ఒప్పందం!

ఒక్క వరల్డ్ కప్ తో ఇండియా క్రేజ్ ని, క్రికెట్ ని మార్చేసిన 1983 క్రికెట్ టీమ్.. వరల్డ్ కప్ ఎలా సాధించారు..? హేమాహేమీలున్న టీమ్స్ తో పోరాడి ఇండియా వరల్డ్ కప్ ఎలా గెలుచుకుందో.. పాయింట్ టూ పాయింట్ చిన్న డీటెయిల్డ్ తో సహా చూపించబోతున్నారు 83 సినిమాలో. రణవీర్ సింగ్ కపిల్ దేవ్ గా దీపికా పడుకోన్ భార్యగా నటిస్తున్న 83 ట్రైలర్ ఆడియన్స్ కి ఎమోషనల్ గా బాగా ఎటాచ్ అయ్యింది. అందుకే రిలీజ్ అయిన 24 గంటల్లోనే 5 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Song Promotions: ఒక్కో పాట రిలీజ్.. ప్రమోషన్స్‌లో కొత్త టెక్నిక్!

సినిమా ప్లాట్ ఎలాంటిదైనా.. దానికి ఎమోషన్స్ యాడ్ చేసి ఆడియన్స్ కి రీచ్ చెయ్యడంలో డైరెక్టర్ కబీర్ ఖాన్ స్పెషలిస్ట్. ఈ 83 మూవీ స్పోర్ట్స్ డ్రామా అయినా.. అంతకుమించిన ఇండియన్స్ ఎమోషన్స్ ని సినిమాలో యాడ్ చేశారు కబీర్ ఖాన్. పాన్ ఇండియా వైడ్ గా క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ అవుతున్న 83లో కాస్టింగ్ కూడా అదిరిపోయే అప్పటి టీమ్ మెంబర్స్ ని చూసినట్టే అనిపించేలా సెలక్ట్ చేశారు. మరి అప్పటి వరల్డ్ కప్ ఎమోషన్ ని చూడాలంటే క్రిస్ మస్ వరకూ వెయిట్ చెయ్యల్సిందే.