నెపోటిజంపై సోనాక్షీ కామెంట్స్.. కంగనాకు కౌంటర్!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో నెపోటిజంపై చర్చ కొనసాగుతోంది. చాలా మంది స్టార్ పిల్లలను లక్ష్యంగా చేసుకుంటూ నెటిజన్లు, సినిమా ఇండస్ట్రీలోని కొందరు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది స్టార్లు అభిమానవాదానికి మరియు స్వపక్షపాతానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారిలో కంగనా రనౌత్ పేరు అగ్రస్థానంలో ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నెపోటిజం గురించి మాట్లాడింది.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంతో, స్టార్ పిల్లలపై ద్వేషపూరిత ప్రచారం సాగుతుండగా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి నిష్క్రమించిన సోనాక్షి సిన్హా.. అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉన్నారు. లేటెస్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్‌తో చేసిన చాట్‌లో మాట్లాడుతూ.. బాలీవుడ్లో నెపోటిజం ఆరోపణలను సోనాక్షి సిన్హా ఖండించడమే కాక, కంగనా రనౌత్ పేరు పెట్టకుండా ఆరోపణలు చేశారు. నెపోటిజం అనే పదం ఆశ్చర్యకరమైనది. కానీ ఆ ప్రచారం చేసిన వ్యక్తి సోదరి వారి పనిలో సహాయం చేస్తుంటుంది. అంటూ కంగనా రనౌత్ గురించి సోనాక్షి పరోక్షంగా విమర్శించారు. తన తండ్రి శత్రుఘన్ సిన్హా మాత్రం తన కోసం ఒక్క ఫోన్ కాల్ కూడా ఎవరికీ చేయలేదని నటి సోనాక్షి చెప్పుకొచ్చింది. నెపోటిజం కామెంట్లకుు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని అనుకోవట్లేదు అని ఆమె అన్నారు.
స్టార్ కిడ్ స్టేటస్‌ను సద్వినియోగం చేసుకోవాలనే కోరికతో, నా తండ్రి ఎవ్వరినీ పిలవలేదు అని, ఏ నిర్మాతకు చెప్పలేదు అని ఆమె అన్నరు. ఇదే సమయంలో ట్విట్టర్ నుండి దూరంగా ఉండటం సంతోషంగా ఉందని, తిరిగి రావటానికి కూడా ఇష్టపడట్లేదని చెప్పింది. తన జీవితం ఇప్పుడు చాలా మంచిగా మారిందని, చాలా శుభ్రంగా ఉందని, ట్విట్టర్ ను వదిలి వెళ్ళడంపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని సోనాక్షి అన్నారు. ఈ రోజు, పరిశ్రమలో లోపలి వ్యక్తుల కంటే ఎక్కువ మంది బయటి వ్యక్తులు ఉన్నారని నటి అభిప్రాయపడింది.