Sonal Chauhan : బాలీవుడ్‌ని ‘ఆదిపురుష్’కు ముందు ‘ఆదిపురుష్’కు తర్వాతగా చూస్తాం.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..

పలు తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహన్ చివరిసారిగా నాగార్జునతో కలిసి ది ఘోస్ట్ సినిమాలో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది సోనాల్. గతంలోనే తాను ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాను అని ప్రకటించింది.

Sonal Chauhan : బాలీవుడ్‌ని ‘ఆదిపురుష్’కు ముందు ‘ఆదిపురుష్’కు తర్వాతగా చూస్తాం.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Sonal Chauhan Interesting comments on Adipurush movie and Bollywood

Adipurush :  ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో భారీగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ సినిమాలో సోనాల్ చౌహన్ కూడా ఓ పాత్ర పోషిస్తుందని గతంలోనే ప్రకటించింది.

పలు తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహన్ చివరిసారిగా నాగార్జునతో కలిసి ది ఘోస్ట్ సినిమాలో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది సోనాల్. గతంలోనే తాను ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాను అని ప్రకటించింది. కానీ ఏ పాత్రలో నటిస్తుందో చెప్పలేదు.

Siddharth : పాటలతో స్టేజిపై అదరగొట్టిన సిద్దార్థ్.. బొమ్మరిల్లు 2 అనౌన్సమెంట్?

తాజాగా బాలీవుడ్ లో ఓ కార్యక్రమానికి రాగా మీడియా ఆదిపురుష్ గురించి సోనాల్ చౌహన్ ని అడిగారు. సోనాల్ చౌహన్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ చాలా స్పెషల్ సినిమా. అందరికి ఈ సినిమా గుర్తుండిపోతుంది. బాలీవుడ్ ని అయితే ఆదిపురుష్ కు ముందు, ఆదిపురుష్ కు తర్వాత అని చూస్తాము సినిమా రిలీజ్ అయ్యాక అని కామెంట్స్ చేసింది. దీంతో సోనాల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.