Super Dancer 4: శిల్పాశెట్టి స్థానంలో సోనాలి బింద్రే.. కొనసాగిస్తారా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, యోగా అండ్ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పాశెట్టి జీవితం ఒక్కసారిగా అపవాదుల మయం అయిపోయిన సంగతి తెలిసిందే. నీలిచిత్రాల వ్యవహారంలో ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం తర్వాత ఆమె ఇంటి నుండి అడుగు బయటపెట్టడం లేదు. ఇంతకు ముందు శిల్పాశెట్టి అంటే.. బాలీవుడ్ లో ఒక గౌరవం, ఒక విలువ ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

Super Dancer 4: శిల్పాశెట్టి స్థానంలో సోనాలి బింద్రే.. కొనసాగిస్తారా?

Super Dancer 4

Super Dancer 4: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, యోగా అండ్ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పాశెట్టి జీవితం ఒక్కసారిగా అపవాదుల మయం అయిపోయిన సంగతి తెలిసిందే. నీలిచిత్రాల వ్యవహారంలో ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం తర్వాత ఆమె ఇంటి నుండి అడుగు బయటపెట్టడం లేదు. ఇంతకు ముందు శిల్పాశెట్టి అంటే.. బాలీవుడ్ లో ఒక గౌరవం, ఒక విలువ ఉండేది. ఆమెను తమ షోకి జడ్జ్ గా ఒప్పించడానికి బుల్లితెర నిర్మాతలు నానా కష్టాలు పడేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ప్రస్తుతం శిల్పాశెట్టిని నిర్మాతలే దూరం పెడుతున్నారా.. ఆమెనే షోస్ కు దూరం ఉంటుందో కానీ.. భర్త అరెస్ట్ తర్వాత ఆమె ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు ఆమె జడ్జిగా నడిచే రియాలిటీ షోస్ ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె చాలా కాలంగా జడ్జిగా వ్యవహరిస్తున్న డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ నాల్గవ సీజన్ కు వారానికి ఒకరి స్పెషల్ జడ్జెస్ ప్రత్యక్షమవుతున్నారు. ఈ షోలో శిల్పాశెట్టి గీత కపూర్, అనురాగ్ బసుతో కలిసి జడ్జిగా కనిపించేవారు.

కానీ రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పా స్థానంలో జెనీలియా డిసౌజ్, రితేష్ దేశముఖ్, కరిష్మా కపూర్ తదితరులు వ్యహరించారు. ఇక ఇప్పుడు శిల్పా స్థానంలో మరో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే ఎంట్రీ ఇచ్చింది. సోనాలి ఎంట్రీ ఈ షోకు మరింత హైప్ తెచ్చినట్లుగా కనిపిస్తుంది. క్యాన్సర్ పై పోరాడి గెలిచిన సోనాలి 46 ఏళ్ల వయసులో 20 ఏళ్ల ఏజ్ ఫిజిక్ తో అదరగొడుతుంది. శిల్పా తర్వాత సోనాలి ఎంట్రీ ఈ షోకు గ్లామర్ లుక్ తీసుకురావడంతో ఇక ఈమెనే కంటిన్యూ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే.. మరి శిల్పా మళ్ళీ యాక్టివ్ అయితే షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.