NTR30: తారక్ అక్కగా సోనాలీ రీఎంట్రీ!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చిరంజీవి నుండి మహేష్ బాబు వరకు స్టార్ హీరోలతో నటించిన సోనాలీ బింద్రే బాలీవుడ్ లో కూడా ఓ పొజిషన్ దక్కించుకుంది.

NTR30: తారక్ అక్కగా సోనాలీ రీఎంట్రీ!

Ntr30

NTR30: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చిరంజీవి నుండి మహేష్ బాబు వరకు స్టార్ హీరోలతో నటించిన సోనాలీ బింద్రే బాలీవుడ్ లో కూడా ఓ పొజిషన్ దక్కించుకుంది. అయితే.. కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే క్యాన్సర్ సోకడం.. మహమ్మారితో పోరాడి గెలిచి ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీకి సిద్దమవుతుంది. అది కూడా ఓ తెలుగు సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో సోనాలీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

NTR30: కొత్త సినిమా మొదలెప్పుడు తారక్.. అభిమానుల ఆవేదన!

మూడేళ్ళ సినిమా కెరీర్ ను ఆర్ఆర్ఆర్ కోసం వదిలేసుకున్న తారక్ ఇప్పుడు గ్యాప్ ను వరస సినిమాలతో ఫుల్ ఫిల్ చేసేందుకు సిద్దమయ్యాడు. దీని కోసం వరసగా సినిమాలను పట్టాలెక్కించేందుకు సిద్దమైన తారక్ ముందుగా కొరటాల శివ సినిమా చేయనున్నాడు. అతి త్వరలోనే మొదలు కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవగా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

అందునా ఆర్ఆర్ఆర్ తర్వాత రాబోయే ఎన్టీఆర్ సినిమా కావడం.. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుండడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే భారీ క్యాస్టింగ్ ను కూడా తీసుకోనుండగా.. ఇది పొలిటికల్ టచ్ ఉన్న సినిమాగా సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాతోనే సోనాలి బింద్రే కూడా రీ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఇప్పుడు మరోసారి ప్రేక్షకులలో ఈ సినిమా అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. అయితే.. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే మేకర్స్ నుండి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.