Sonam Kapoor : ప్రెగ్నెంట్ అయిన బాలీవుడ్ హీరోయిన్.. బయట పెట్టిన బేబీబంప్ ఫోటోలు

తన భర్తతో కలిసి దిగిన కొన్ని ఫొటోలని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది సోనమ్ కపూర్. ఈ ఫోటోలలో సోనమ్ బేబీ బంప్ తో ఉంది. ఈ ఫొటోలతో తాను ప్రెగ్నెంట్ అని తెలిపింది సోనమ్ కపూర్.

Sonam Kapoor : ప్రెగ్నెంట్ అయిన బాలీవుడ్ హీరోయిన్.. బయట పెట్టిన బేబీబంప్ ఫోటోలు

Sonam

 

Sonam Kapoor :  బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె, ప్రముఖ హీరోయిన్ సోనమ్ కపూర్ పలు సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించింది. ఇప్పటికి కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ఉంది. సోనమ్ 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజా ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది సోనమ్. అయితే తాజాగా సోనమ్ ఇన్ని రోజులు సీక్రెట్ గా దాచిన విషయాన్ని అందరికి పంచుకుంది.

 

తన భర్తతో కలిసి దిగిన కొన్ని ఫొటోలని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది సోనమ్ కపూర్. ఈ ఫోటోలలో సోనమ్ బేబీ బంప్ తో ఉంది. ఈ ఫొటోలతో తాను ప్రెగ్నెంట్ అని తెలిపింది సోనమ్ కపూర్. భర్తతో కలిసి ఉన్న బేబీ బంప్ ఫొటోలని షేర్ చేస్తూ.. ”నాలుగు చేతులు. మేము చేయగలిగినంత ఉత్తమంగా నిన్ను పెంచడానికి. రెండు హృదయాలు. అవి నీతో కలిసి అడుగడుగునా కొట్టుకుంటాయి. ఒక కుటుంబం నీకు ప్రేమ మరియు మద్దతును ఇస్తుంది. మేము నిన్ను స్వాగతించడానికి వేచి చూస్తున్నాము” అంటూ తనకి పుట్టబోయే పిల్లల గురించి రాస్తూ పోస్ట్ చేస్తుంది.

Yash : ‘కెజిఎఫ్ 2’ నుంచి తూఫాన్ సాంగ్ విడుదల

ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్లు ఈ జంటకి అభినందనలు తెలియచేస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ జంట పండంటి బిడ్డకి జన్మనివ్వనున్నారు.