మీ సాల్ట్ లో అయోడిన్ ఉందా.. సోనమ్ కపూర్

10TV Telugu News

ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సోనమ్‌ అందం ఏమాత్రం తగ్గలేదు. దానికి కారణం కేవలం ఆమె పాటించే ఆహారపుటలవాట్లు మాత్రమే. అయితే సోనమ్ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఓ ముఖ్యమైన సలహా చెప్పింది. వెజిటేరియన్లు, వీగన్ల మాత్రం ఈ సలహా తప్పకుండా పాటించాలని తెలిపింది. 

అదేంటంటే.. తాజాగా సోనమ్ కు ఓ ఆరోగ్య సమస్య ఎదురైంది. ఆమె ప్రస్తుతం అయోడిన్ లోపంతో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తెలిసింది.. కాబట్టి శాఖాహారులందరికీ ఓ రిక్వెస్ట్ మీరు తినే ఉప్పులో అయోడిన్ ఉండేలా చూసుకోండి. నేను కూడా ఇప్పటి నుండి ఉప్పులో అయోడిన్ ఉండేటట్టు చూసుకుంటున్నాను.. థ్యాంక్యూ! లవ్‌ యూ ఆల్‌’ అంటూ తన సమస్యను ఇన్స్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.   

జంతు ప్రేమికురాలైన సోనమ్ ఈ మధ్య వీగన్‌ డైట్‌ ఫాలో అవుతారన్న సంగతి తెలిసిందే. వీగన్‌ డైట్ అంటే జంతువుల నుంచి వచ్చే ఏ పదార్థాన్ని వాడకపోవడమే వీగనిజం. వీగన్లు పాల పదార్థాలు కానీ ఉన్ని, లెదర్‌ దుస్తులు కానీ వాడరు. మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుని జీవిస్తారు. దీని వల్లే తనకు అయోడిన్ లోపం వచ్చిందనీ.. అందరూ కచ్చితంగా ఉప్పులో అయోడిన్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది.

ఇక సోనమ్ ప్రస్తుతం.. ‘ది జోయా ఫ్యాక్టర్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 2008లో అనుజా చౌహాన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది.  ఈ సినిమా సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది.

	sn.jpg