సాకులొద్దు.. తప్పు చేశాం.. ఒప్పుకోవాల్సిందే! – సోనూసూద్

సాకులొద్దు.. తప్పు చేశాం.. ఒప్పుకోవాల్సిందే! – సోనూసూద్

Sonu Sood Feels India Was Never Prepared

Sonu Sood feels: సెకండ్ వేవ్ కారణంగా ఆస్పత్రులే కాదు.. స్మశానాల్లో కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఫస్ట్ వేవ్.. గతేడాది భారత్‌ని తాకినప్పటి నుంచి సోను సూద్ అవసరమైన ప్రజలకు సహాయం చేస్తూ మెస్సయ్యాగా మారిపోయారు. సెకండ్ వేవ్‌లో ప్రజలకు అవసరమైన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే, చైనా, ఫ్రాన్స్, కంపెనీలుతో పాటు తైవాన్ కంపెనీలను సంప్రదించి ఆక్సిజన్ ప్లాంట్‌లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

సెకండ్ వేవ్‌లో భారతీయులు కరోనాపై పోరాటంలో సిద్ధంగా లేని కారణంగా ఇప్పుడు పరస్థితి అదుపు తప్పిందని, అటువంటి తప్పు రిపీట్ కాకుండా ఉండేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. మూడవ వేవ్ కోసం ఆలోచన సిద్ధం కావాలని సోను తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల దగ్గరకు వెళ్లే తన బృందంలోని వ్యక్తుల సంఖ్యను పెంచినట్లు వెల్లడించారు. 400 మంది టీమ్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం తన వంతు కృషి చేస్తున్నప్పటికీ, ముందుగానే చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహమ్మారిపై భారతదేశం యొక్క పేలవమైన ప్రతిస్పందన గురించి మాట్లాడుతూ.. మన జిడిపిలో ఒకటి నుండి రెండు శాతం మాత్రమే ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేస్తున్నారని సోను పేర్కొన్నారు. అందువల్లే దేశం మహమ్మారిపై పోరాటంలో సిద్ధంగా లేదు. భారతదేశం జనసాంద్రత కలిగిన దేశం, అని సాకు చెప్పవచ్చు కానీ, తప్పు చేశామని మాత్రం అంగీకరించాలని అన్నారు.