Sonu Sood: సార్ సాయం చెయ్యండి.. నా భార్య మా అత్తారిల్లు మర్చిపోయింది.. సోనూసూద్‌ ఫన్నీ రిప్లై!

కరోనా కష్టకాలంలో మెస్సయ్యగా మారిన సోనూసూద్‌కు ప్రతీరోజూ వేలల్లో, లక్షల్లో సహాయం కోసం నెటిజన్లు ట్వీట్లు చేస్తూ ఉంటారు.

Sonu Sood: సార్ సాయం చెయ్యండి.. నా భార్య మా అత్తారిల్లు మర్చిపోయింది.. సోనూసూద్‌ ఫన్నీ రిప్లై!

Sonusood

Sonu Sood: కరోనా కష్టకాలంలో మెస్సయ్యగా మారిన సోనూసూద్‌కు ప్రతీరోజూ వేలల్లో, లక్షల్లో సహాయం కోసం నెటిజన్లు ట్వీట్లు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ కొందరు సరదాగా కూడా సోనూకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో లేటెస్ట్‌గా ఓ భార్యా బాధితుడు చేసిన రిక్వెస్ట్‌కు సోనూసూద్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు.

ప్రవీణ్ శర్మ అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నటుడు సోనూ సూద్‌ను సహాయం కోసం అభ్యర్థించాడు. ప్రవీణ్ అడిగిన సహాయం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. సోనూ సూద్ కూడా అదే చమత్కారమైన శైలిలో ప్రవీణ్ శర్మకు ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.

సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ, ప్రవీణ్ శర్మ ఈ విధంగా రాసుకొచ్చారు. “సోను సార్.. నా భార్య లాక్‌డౌన్ నుంచి మాతోనే మా ఇంట్లోనే ఉంది. ఆమె తన తల్లి ఇంటికి వెళ్ళే మార్గాన్ని కూడా మరచిపోయింది. ఆమెను ఎక్కడో ఒకచోట వదిలేయండి. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేయండి.” అంటూ ట్వీట్ చేశారు.

ప్రవీణ్ శర్మ ట్వీట్ చదివిన సోనూసూద్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. “సోదరా.. భార్యా బాధిత భర్తల జాబితా చాలా పెద్దదిగా ఉంది” మీరు క్యూలో ఉండాల్సిందేనంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఈ ట్వీట్‌పై సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.


కరోనా సమయంలో ముంబైలో ఉంటూ.. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ నుంచి అనేకమందికి సాయం అందింది.