మాల్దీవులకు పంపించమన్న నెటిజన్.. సోను రిప్లై ఏంటో తెలుసా!

  • Published By: sekhar ,Published On : October 31, 2020 / 01:59 PM IST
మాల్దీవులకు పంపించమన్న నెటిజన్.. సోను రిప్లై ఏంటో తెలుసా!

Sonu Sood: ఆన్‌ స్క్రీన్ విలన్ సోను సూద్ లాక్‌డౌన్ సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ఆఫ్ స్క్రీన్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికీ అవసరమున్నవారికి.. కష్టమొచ్చిందని చెప్పుకున్న వారికి తనకు తోచిన విధంగా సాయమందిస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో వింత కోరికలు కోరడం దానికి సోనూ తన స్టైల్లో ఫన్నీగా సమాధానమివ్వడం చూస్తూనే ఉన్నాం..


తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్.. దానికి సోనూ సూద్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సార్.. నాకు మాల్దీవులకు వెళ్లాలని ఉంది. ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యండి’.. అని సోనూను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సోనూ.. ‘భయ్యా.. నీకు సైకిల్ కావాలా? రిక్షా కావాలా?’ అని అడిగారు. సోనూ ఫన్నీ రిప్లై నెటిజన్లను ఆకట్టుకోవడమే కాక తెగ వైరల్ అవుతోంది.


కాగా గత నాలుగు నెలల్లో సోనూ దగ్గరకు చాలా రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఆయన దగ్గర 703200 మందికి సంబంధించిన ఫోన్, ఆధార్ నంబర్లతో పాటు అడ్రస్‌లు కూడా ఉన్నాయి.. ప్రతి సెకనుకు వారి సంఖ్య తగ్గుతుంది అంటే సాయమందించడానికి సోను అండ్ టీమ్ ఎంత కష్టడుతున్నారో అర్థమవుతోంది.