Sonu Sood : సారంగికి సోనూసూద్ సాయం..

పిలిస్తే పలుకుతా అంటున్నాడు సినీ నటుడు సోనూసూద్. తాజాగా ఒక సారంగి విద్వాంసుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. హర్యానాకు చెందిన ఒక సారంగి వాయిద్యకారుడు...

Sonu Sood : సారంగికి సోనూసూద్ సాయం..

Sonu Sood helping sarangi artist

Sonu Sood : పిలిస్తే పలుకుతా అంటున్నాడు సినీ నటుడు సోనూసూద్. సినిమాలో అందరికి శత్రువులా కనిపించే ఈ నటుడు నిజజీవితంలో అజాతశత్రువుగా నిలిస్తున్నాడు. కరోనా కష్ట సమయంలో సహాయం అని అన్నవారికి నేను ఉన్నానంటూ అభయం ఇచ్చాడు. కానీ ఆ సేవ అక్కడితో నిలిపివేయలేదు. ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్‌’ను స్థాపించి దేశ నలుమూలలకు తన సేవలను అందిస్తున్నారు.

Sonu Sood : అరుదైన గౌరవం దక్కించుకున్న సోనూసూద్..

తాజాగా ఒక సారంగి విద్వాంసుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. హర్యానాకు చెందిన ఒక సారంగి వాయిద్యకారుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ విద్వాంసుడు పరిస్థితిని చూసి చాలించిన ఒక నెటిజెన్ ట్విట్టర్ వేదికగా సోనూసూద్ ని ఆ కళాకారుడికి సాయం చేయాలంటూ ట్వీట్ చేశాడు. దానికి సోనూసూద్ సాయం చేస్తానని రీట్వీట్ చేస్తూ బదులిచ్చాడు.

“ఖాన్ సాహిబ్, నేను ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా, ఆ తరువాత మీ సారంగి పాట వింటా” అంటూ బదులిచ్చాడు. కాగా సాయం అడగని వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ రియల్ హీరోని.. సొసైటీ అచీవర్స్ అవార్డ్స్‌ 2022 గాను మహారాష్ట్ర ప్రభుత్వం ‘నేషన్స్ ప్రైడ్’ అనే బిరుదుతో సోనూసూద్ ని సత్కరించింది.