Updated On - 4:59 pm, Sat, 27 February 21
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు అపర భగీరథుడయ్యాడు. చేతి పంపులు బిగించి అక్కడి ప్రజల దప్పికను తీర్చి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు ఈ నిజమైన హీరో.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పరిధిలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి.. తమ గ్రామంలో నీటి సమస్య ఉందంటూ సోనూసూద్‌ను సంప్రదించాడు. దీనికి స్పందించిన సోనూ.. గ్రామంలో చేతి పంపులు బిగించాడు. ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఉందని, తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడుస్తున్నామని అక్కడి వారు చెప్పడంతో పంపులు ఏర్పాటు చేశాడు. దీంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇంత చేసినా ఆ గ్రామానికి ఒక్కసారి కూడా వెళ్లలేదు సోనూసూద్. ఏదో ఒక రోజు ఆ గ్రామానికి వెళ్లి ఆ పంపులో వచ్చే మంచి నీటిని తాగుతానని ఆయన తెలిపాడు.
కరోనా కష్ట కాలంలోనూ సోనూ పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఇటీవల ఉత్తరాఖండ్ వరదల్లో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి సైతం తన వంతు సాయం అందించాడు ఈ రియాల్టీ హీరో. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఆచార్యలో సందడి చేయనున్నాడు. ఈ.నివాస్ దర్శకత్వంలో రాబోతున్న కిసాన్ చిత్రానికి కూడా సోనూ ఓకే చెప్పేశాడు.
ఊరినే కబ్జా చేసేశాడు.. 19 ఏళ్ల తర్వాత వెలుగులోకి..
Tollywood : లేటెస్ట్ 30 ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్..
Told to ‘go die’..కరోనా వచ్చిందా?అయితే ఛస్తే..చావు మాకేంటీ..బాధితుడికి హెల్ప్ లైన్ సిబ్బంది సమాధానం
Sonu Sood : సోనూ సూద్‌కు కరోనా.. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సోకిన మహమ్మారి..
Tollywood: ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ టాలీవుడ్ 30 అప్డేట్స్..
Gang Rape On Widow : పెన్షన్ ఇప్పిస్తానని వితంతుపై అత్యాచారం