SonuSood : సోదరితో కలిసి 1000 మందికి సైకిల్స్ పంపిణి చేసిన రియల్ హీరో సోనూసూద్

సామాజిక కార్య‌క‌ర్త‌ల‌కు త‌న సోద‌రి మాళ‌విక సూద్ స‌చార్‌తో క‌లిసి సైకిళ్లు పంపిణీ చేశాడు. ఈ క్యాంపైన్ తో ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న ఎంతో మంది విద్యార్థినులకు సైకిల్స్.......

SonuSood : సోదరితో కలిసి 1000 మందికి సైకిల్స్ పంపిణి చేసిన రియల్ హీరో సోనూసూద్

Sonusood

SonuSood : కరోనా కోరల్లో లాక్‌డౌన్ టైంలో క‌ష్టాల్లో చిక్కుకున్న ఎంతోమందికి నేనున్నానంటూ అండ‌గా నిలిచాడు సోనూసూద్. కరోనా తర్వాత కూడా సోనూసూద్ తన సేవా కార్యక్రమాల్ని ఆపలేదు. ఒక ట్రస్ట్ ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తున్నాడు. అంతే కాక డైరెక్ట్ గా కానీ, సోషల్ మీడియాలో కానీ తాము కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే తానే డీటెయిల్స్ అన్ని కనుక్కొని మరీ సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు సోనూసూద్ ఎంతోమంది గుండెల్లో దేవుడిగా మారిపోయాడు. తాజాగా మరో సేవా కార్యక్రమంతో తన గొప్పమనుసుని చాటుకున్నాడు సోనూసూద్.

SreeReddy : షణ్ముఖ్ చేస్తే తప్పు? నువ్వు చేస్తే కరెక్టా?.. షన్ను దీపు బ్రేకప్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

పంజాబ్ లోని మోగా జిల్లాలో సుమారు 40-45 గ్రామాల విద్యార్థినులు చదువాబుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఇది తెలుసుకున్న సోనూసూద్ ‘మోగా కీ బేటి’ క్యాంపెయిన్‌లో భాగంగా మోగా ప‌ట్ట‌ణంలో 1000 మంది విద్యార్థినులు, సామాజిక కార్య‌క‌ర్త‌ల‌కు త‌న సోద‌రి మాళ‌విక సూద్ స‌చార్‌తో క‌లిసి సైకిళ్లు పంపిణీ చేశాడు. ఈ క్యాంపైన్ తో ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న ఎంతో మంది విద్యార్థినులకు సైకిల్స్ అందాయి. 8 నుంచి 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న అర్హులైన విద్యార్థినుల‌కు సాయం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సైకిళ్ల‌ను పంపిణీ చేశామ‌ని, సామాజిక కార్య‌క‌ర్త‌ల‌కు కూడా సైకిళ్లు అందించామ‌ని సోనూసూద్ ఈ కార్యక్రమంలో తెలిపాడు.