Sooryavanshi : పాండెమిక్ తర్వాత బుల్లెట్ దిగింది.. వంద కోట్ల క్లబ్‌లో!

అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి కాంబోలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’ వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది..

Sooryavanshi : పాండెమిక్ తర్వాత బుల్లెట్ దిగింది.. వంద కోట్ల క్లబ్‌లో!

Sooryavanshi 100 Cr

Sooryavanshi: అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా.. సెన్సేషనల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’.. దీపావళి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ అతిథి పాత్రల్లో నటించడంతో క్రేజ్ మరింత పెరిగింది.

Unstoppable : సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్ నాని.. ఇది చిన్న శాంపిల్ మాత్రమే..

నవంబర్ 5న విడుదలైన ‘సూర్యవంశీ’ కేవలం రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. మహారాష్ట్రతో పాటు మిగతా కొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. మూడో రోజుకి రూ. 75 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. నాలుగో రోజుకి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయి ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్యపరచడమే కాక.. పాండెమిక్ తర్వాత బాక్సాఫీస్ బరిలో సత్తా చాటిన ఫస్ట్ బాలీవుడ్ మూవీగా రికార్డ్ నెలకొల్పింది.

Unstoppable With NBK : బాలయ్యా.. ఈ అభిమానం నీకే చెల్లునయ్యా.. షో రోడ్ మీద స్క్రీనింగ్!

‘సూర్యవంశీ’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు..
ఇండియా గ్రాస్..
ఫస్ట్ డే – 31.40 కోట్లు
సెకండ్ డే – 29.16 కోట్లు
థర్డ్ డే – 32.02 కోట్లు

ఓవర్సీస్..
ఫస్ట్ డే – 8.10 కోట్లు
సెకండ్ డే – 8.58 కోట్లు
థర్డ్ డే – 7.09 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ – 117.16 కోట్లు..

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..